»Aimim Party Soon Akbaruddins Daughter Fatima Owaisi Entry Into Politics
AIMIM: త్వరలో అక్బరుద్దీన్ కూతురు రాజకీయాల్లోకి ఎంట్రీ?
మహిళలకు రాజకీయం వద్దు అన్న ఎంఐఎం పార్టీలో అక్బరుద్దీన్ ఓవైసీ కూతురు రాజకీయ అరంగేట్రం చేస్తుందన్న సమాచారం బలంగా వినిపిస్తుంది. ఇప్పటివరకు పురుషాధిక్య పార్టీగా పేరున్న ఎంఐఎం త్వరలోనే ఆ అపవాదును తొలిగించే పనిలో ఉందని తెలుస్తుంది.
AIMIM party, soon Akbaruddin's daughter Fatima Owaisi entry into politics?
AIMIM: ఏఐఎంఐఎం(AIMIM) పార్టీకి దేశప్యాప్తంగా ఓటు బ్యాంక్ ఉంది. అలాగే మన తెలంగాణ(Telangana)లో ఈ పార్టీకి ఒక నిర్ధిష్టమైన ఓటర్లు ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్(Hyderabad) పాతబస్తీ ఏరియాలో మొత్తం ఈ పార్టీ హవా నడుస్తున్న విషయం తెలిసిందే. అన్ని బాగానే ఉన్నా ఈ పార్టీలో మాత్రం ఒక్కరు కూడా లేడీ కంటెస్టెంట్ లేరు. దీన్నే అధిగమించాలని పార్టీ కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. ఈ మేరకు పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ( Akbaruddin Owaisi ) కూతురు ఫాతిమా ఓవైసీ( Fatima Owaisi ) రాజకీయ అరంగెట్రం చేస్తున్నట్లు సమాచారం. ఓ కార్యక్రమంలో పాల్గొన్న అక్బరుద్దీన్ ఓవైసీ ప్రజాసేవలో భాగం అయ్యేందుకు లండన్లో బారిష్టర్ చదువుతున్న తన కూతురు హైదరాబాద్ తిరిగి వస్తుందని తెలిపారు.
పార్టీపై పడిన పురుషాధిక్య ముద్రను చెరిపేసుకునే ప్రయత్నంలో భాగంగానే ఎంఐఎం పార్టీ మహిళా నాయకురాలిని రంగంలోకి తీసుకొస్తున్నారని తెలుస్తోంది. అలాగే ఇటివల జరిగిన అత్యవసర పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టిన మహిళా బిల్లును ఎంఐఎం వ్యతిరేకించింది. దీన్ని ప్రజలు తప్పుగా భావించే అవకాశం ఉందని పార్టీ భావించందని, దీంతో జరిగిన పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నంగా ఫాతిమా ఓవైసీని రాజకీయాల్లో తీసుకొస్తున్నారని తెలుస్తుంది. అంతే కాకుండా ఎంఐఎంలో మహిళలకు ప్రాధాన్యం ఉంటుందన్న విషయాన్ని ప్రజలు గమనిస్తారనే ఆలోచనలో పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. అయితే ఫాతిమా పార్టీలో ఎప్పుడు ఎంట్రీ ఇస్తుంది, తనను ఎమ్మెల్యేగా కంటెస్టెంట్ చేపిస్తారా లేదా ఏదైనా నామినేటెడ్ పదవి ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది.