»Brs Mla Kcr To Takes Oath As Mla On February 1st Check Here Details
Telangana: ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం.. డేట్ ఫిక్స్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తుంటి ఎముక శస్త్రచికిత్స కారణంగా కేసీఆర్ ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ప్రమాణం చేయలేదు.
KCR Bhima- Prati Intiki Dhima kcr announce Promise
KCR : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తుంటి ఎముక శస్త్రచికిత్స కారణంగా కేసీఆర్ ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ప్రమాణం చేయలేదు. ఇప్పుడు కాస్త కోలుకుని అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 1న అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదిలా ఉంటే, ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కామారెడ్డి, గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. కామారెడ్డిలో ఓడిపోయారు. గజ్వేల్ నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పరాజయం పాలవడంతో కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది.
ఓటమి నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా గవర్నర్‌కు రాజీనామా లేఖను పంపించి.. అక్కడి నుంచి ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ఓ రాత్రి కేసీఆర్ కాలుజారి పడిపోయారు. ఈ ఘటనలో అతని తుంటి ఎముక ఫ్రాక్ఛర్ అయింది. యశోద ఆసుపత్రిలో చేరి తుంటి ఎముకను మార్చడానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఎనిమిది వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించగా.. ఇప్పటి వరకు కేసీఆర్ బెడ్ రెస్ట్ లో ఉన్నారు. ఇప్పుడు కాస్త కోలుకుని ప్రజా క్షేత్రంలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కథనంలో కేసీఆర్ రంగంలోకి దూకేందుకు సిద్ధమయ్యారు. ఈక్రమంలో ముందుగా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.