»Asian Games 2023 India Reached The Semis Of The Asian Games T20
Asian Games 2023: ఏషియన్ గేమ్స్ టీ20లో సెమీస్కు చేరిన భారత్
ఆసియా క్రీడల్లో టీమిండియా సత్తా చాటింది. టీ20లో నేపాల్ జట్టును 23 పరుగుల తేడాతో ఓడించి సెమీస్కు చేరింది. భారత ఆటగాడు యశస్వి జైస్వాల్ 49 బంతుల్లోనే 100 పరుగులు చేసి రికార్డు నెలకొల్పాడు.
ఏషియన్ గేమ్స్ (Asian Games)లో భారత్ పతకాలతో దూసుకుపోతోంది. తాజాగా టీ20 (T20)లో భారత్ సెమీస్కు చేరింది. పురుషుల క్రికెట్ విభాగంలో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో నేపాల్ పై 23 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా 4 వికెట్లకు 202 పరుగులు చేసింది. భారత క్రికెటర్ యశస్వి జైస్వాల్ 49 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు.
THE HISTORICAL MOMENT:
Yashasvi Jaiswal the youngest T20i centurion for India and the first Indian to score a hundred in a multi-sports event. pic.twitter.com/PzFVxjxrCW
ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన క్రికెటర్గా యశస్వి జైస్వాల్ రికార్డు నమోదు చేశాడు. ఆ తర్వాత 203 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన నేపాల్ 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు మాత్రమే చేసింది. నేపాల్ క్రీడాకారుల్లో దీపేంద్ర సింగ్ ఐరీ 32 పరుగులతో టాప్ స్కోర్ చేశాడు. భారత బౌలర్లు అవేశ్ ఖాన్ 3, రవి బిష్ణోయ్ 3, అర్ష్ దీప్ సింగ్ 2, సాయి కోశోర్ ఓ వికెట్ను పడగొట్టారు. 23 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించడంతో ఆసియా క్రీడల్లో సెమీస్కు చేరింది.