TG: రాష్ట్రంలో త్వరలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. బీబీనగర్ ఎయిమ్స్ ప్రారంభోత్సవం సహా మరికొన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. GHMC ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో మోదీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ రెండో వారంలో ప్రధాని పర్యటనకు పార్టీ వర్గాలు రూట్ మ్యాప్ తయారు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.