»Nia Raids In More Than 60 Places In Telugu States Ap And Telangana
NIA: తెలుగు రాష్ట్రాల్లో 60కిపైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 60కి పైగా ప్రాంతాల్లో ఈరోజు ఉదయం నుంచి ఎన్ఐఏ దాడులు నిర్వహిస్తోంది. తీవ్రవాదం సహా నక్సల్స్ కేసుల్లో ఉన్న పలువురి అనుమానితుల ఇళ్లలో ఈ సోదాలను అధికారులు కొనసాగిస్తున్నారు.
NIA raids in more than 60 places in Telugu states ap and telangana
వామపక్ష తీవ్రవాదం (LWE) లేదా నక్సల్ కేసుల విషయంలో ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ(NIA)సోదాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 60కి పైగా ప్రదేశాలలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) సోమవారం సోదాలు నిర్వహిస్తోంది. రెండు రాష్ట్రాల్లోనూ అనుమానితుల ప్రాంగణాలు, రహస్య స్థావరాల వద్ద దాడులు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి ప్రత్యేక NIA బృందాలు రాష్ట్ర పోలీసు బలగాలతో కలిసి దాడులు నిర్వహించడం ప్రారంభించాయి.
లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం (LWE) లేదా నక్సల్స్ కేసుల్లో ఆంధ్రప్రదేశ్(andhra pradesh), తెలంగాణ(telangana)లోని మొత్తం 60 స్థానాలను శోధిస్తున్నట్లు ఎన్ఐఎ ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ క్రమంలో తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో నక్సల్ సానుభూతిపరులతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న పౌర హక్కుల సానుభూతిపరులకు చెందిన పలువురు నేతల ఇళ్లపై సోదాలు జరుగుతున్నాయి.
2023 ఆగస్టులో పేలుడు పదార్థాలు, డ్రోన్లు, నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్)కు చెందిన లాత్ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ కేసుకు సంబంధించి సెప్టెంబర్ 9న, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లలో NIA వరుస దాడులు, సోదాలు నిర్వహించింది. కొత్తగూడెంలోని చెర్ల మండలంలో జూన్ నెలలో ముగ్గురి నుంచి పేలుడు పదార్థాలు, డ్రోన్లు, లాత్ మిషన్లను స్వాధీనం చేసుకుని 12 మంది నిందితులపై ఎన్ఐఏ కేసు నమోదు చేసింది.