అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో చింతపండు సీజన్ ప్రారంభంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గత ఏడాది కిలో రూ. 30కు పరిమితం కాగా, ఈసారి భారీగా పెరిగింది. ప్రస్తుతం వారపు సంతల్లో కిలో రూ.70 నుంచి రూ. 80 వరకు పలుకుతోంది. మార్చి మొదటి వారం నుంచి ఏప్రిల్ వరకు సీజన్ కొనసాగుతుంది. మంచి ధరలు రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.