ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే తెలియనివారు ఎవరూ లేరు. పుష్ప సినిమా తర్వాత ఆయన రేంజ్ పాన్ ఇండియా స్టార్ కి ఎదిగింది. ఆ సినిమాలో ఆయన నటకు ఫిదా కానివారు లేరు. ఆయన మేనరిజం ని క్రికెటర్లు కూడా ఫాలో అయ్యారంటే,.. ఆ సినిమాతో ఆయన రేంజ్ ఎక్కడిదాకా వెళ్లిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆయనతో కలిసి నటించాలని చాలా మంది హీరోయిన్లు తహతహలాడుతున్నారు. అలాంటిది ఓ హీరోయిన్ మాత్రం… అల్లు అర్జున్ ని ముసలోడు అనేసిందట. అయితే… ఈ విషయం మరీ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఈ మాట ఇప్పుడు కాదు.. గంగోత్రి సినిమా అప్పుడు అన్న మాట. అది కూడా చైల్డ్ ఆర్టిస్ట్ అనడం గమనార్హం.
ఇంతకీ అసలు మ్యాటరేంటంటే… అల్లు అర్జున్ మొదటి సినిమా ‘గంగోత్రి’ లో వల్లంగి పిట్ట ..వల్లంగి పిట్ట అనే ఈ పాటలో ఓ చిన్నారి పాప క్యూట్ క్యూట్ స్మైల్ తో అలరించింది గుర్తుందా…ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ పాప పేరు కావ్య కళ్యాణ్ రామ్.
చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన కావ్య ‘మసూదా’ సినిమాలో హీరోయిన్ గ్గా నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఆలీతో సరదా షోకి వచ్చిన కావ్య తన సినిమా గంగోత్రి టైంలో అల్లు అర్జున్ తో జరిగిన చిన్న ఫన్నీ సంభాషణను బయటపెట్టింది. ప్రజెంట్ ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కావ్య మాట్లాడుతూ..” గంగోత్రి సినిమా టైంలో అల్లు అర్జున్ గారు నువ్వు పెద్ద అయ్యాక కచ్చితంగా హీరోయిన్ అవుతావు అన్నారు. ఆ టైంలో నాకు డేట్స్ ఇస్తావా అని కూడా అడిగారు. అల్లు అర్జున్ కాదు చాలామంది హీరోలు అలా అడిగారు . గంగోత్రి లో హీరోయిన్ గా చిన్నప్పటి క్యారెక్టర్ చేస్తున్న టైంలో అల్లు అర్జున్ పెద్దయ్యాక నువ్వు హీరోయిన్ అవుతావు కదా ..అప్పుడు నీ డేట్స్ కావాలి ఇస్తావా.. అని అడిగారు ..దీంతో అప్పటికి మీరు ముసలోళ్ళు అయిపోతారు కదా ..నాతో ఎక్కడ నటిస్తారు అని అడిగేశాను. ఆ వయసులోనే నా సెన్సాఫ్ హ్యూమర్ పుష్కలంగా ఉంది అంటూ నవ్వింది. కానీ అదే ఆఫర్ ఇప్పుడొస్తే.. అదే అమ్మాయి ఎగిరి గంతేసేది అంటూ బన్నీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.