KTR: సీనియర్ ఎన్టీఆర్కు సాధ్యం కానిది సీఎం కేసీఆర్కు అవుతోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) స్పష్టంచేశారు. ఖమ్మం జిల్లా పర్యటనలో ఈ రోజు బిజీ బిజీగా మంత్రి గడిపారు. ఇటీవల జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు కూడా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. పేదలను ఎన్టీఆర్ గుండెల్లో పెట్టుకున్నారని గుర్తుచేశారు.
తెలుగు వారు దేశంలో ఉన్నారని చేసేట్టు చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆ తర్వాత తెలంగాణ ప్రజలు దేశంలో ఉన్నారని చూసేట్టు చేసింది ఎన్టీఆర్ శిష్యుడు కేసీఆర్ అని స్పష్టంచేశారు. ఎన్టీఆర్ గొప్ప నటుడు, రాజకీయ నేత, సీఎం పదవీ అలంకరించారని వివరించారు. రెండుసార్లు సీఎం పదవీ చేపట్టారని గుర్తుచేశారు. ఎన్టీఆర్కు సాధ్యం కానిది శిష్యుడికి సాధ్యం అవనుందని పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తోందని.. కేసీఆర్ మరోసారి సీఎం పదవీ చేపడుతారని వివరించారు. హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. సీనియర్ ఎన్టీఆర్కు సాధ్యం కానీ పని.. కేసీఆర్ చేస్తారని పేర్కొన్నారు. గురువును మించిన శిష్యుడు అవుతారని తెలిపారు. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పదవీ చేపట్టే అదృష్టం, అవకాశం ప్రజలు ఇవ్వాలని కోరారు. పై నుంచి ఎన్టీఆర్ కూడా ఆశీర్వాదం ఇస్తారని తెలిపారు. అలా చేస్తే ఆయన ఆత్మ శాంతిస్తోందని వివరించారు.
దక్షిణ భారత దేశంలో హ్యాట్రిక్ ఎవరు కొట్టలేదు, అన్నగారు ఎన్టీఆర్ కూడా కొట్టలేదు.. అది సీఎం కేసీఆర్ గారికి సాధ్యమవుతుంది
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఎంతో ఆప్తుడు విశ్వ విఖ్యాత నందమూరి తారక రామారావు గారు.
దక్షిణ భారతదేశంలో హ్యాట్రిక్ సీఎం పదవీ ఎవరూ చేపట్టలేదు. ఆ అవకాశం కేసీఆర్కు ఉందన్నారు. రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారో తమకు తెలియదని.. రాముడు, కృష్ణుడు సీనియర్ ఎన్టీఆర్లో చూసుకున్నాం అని తెలిపారు. అలాంటి మహానేత ఎన్టీఆర్ విగ్రహాం ఆవిష్కరించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని కేటీఆర్ అన్నారు. తన పేరులో తారక రామారావు ఉండటం సంతోషంగా ఉందన్నారు.