BPT: చందోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్డిపాలెం ఎస్సీ కాలనీలో పల్లెనిద్ర కార్యక్రమాన్ని ఎస్సై శివ కుమార్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ, అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా లేదా ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.