బెంగళూరులో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి. ఎవరైనా ఈ నగరాన్ని విజిట్ చేస్తే… ప్రతిరోజు ఆఫీస్‌లకు వెళ్లేవారు ఎంత ఇబ్బందికరంగా వెళ్తున్నారో తెలుస్తుంది. తాజాగా ఓ వధువు బెంగళూరు ట్రాఫిక్ కారణంగా మెట్రో ఎక్కవలసి వచ్చింది. ఇందుకు సంబంధించి వీడియో వైరల్ గా మారింది. ఫరెవర్ బెంగళూరు ట్విట్టర్ హ్యాండిల్ మెట్రోలో ప్రయాణిస్తున్న వధువు వీడియోను పోస్ట్ చేసింది. ఇది ముప్పై సెకన్ల వీడియో. ముహూర్తం సమయానికి కళ్యాణ వేదిక వద్దకు చేరుకోవడానికి ఆమె మెట్రో రైలు ఎక్కింది. పెళ్లి కూతురులా ముస్తాబైన ఆ యువతిని ఓ వ్యక్తి వీడియో తీశాడు. దానిని సోషల్ మీడియోలో పెట్టాడు. ఇది కర్నాటకలో వైరల్ గా మారింది. వాట్ ఏ బ్రైడ్ పేరుతో దీనిని పోస్ట్ చేశారు. గంటల్లోనే లక్షల మంది చూశారు. బెంగళూరులో రోజురోజుకు ట్రాఫిక్ జామ్ పెరుగుతోంది.
ఈ వీడియో ప్రకారం వధువు, ఆమె కుటుంబ సభ్యుల కారు ట్రాఫిక్ లో చిక్కుకున్నది. మరో ఆప్షన్ లేని సమయంలో వారి కుటుంబం మెట్రో ఎక్కింది. నెటిజన్లు బెంగళూరు ట్రాఫిక్ జామ్ పైన స్పందిస్తున్నారు. అదే సమయంలో ఆ వధువును కూడా ప్రశంసిస్తున్నారు. కారు దిగి మెట్రో ఎక్కడానికి కొంతమంది సిగ్గుపడతారు. వదువు అలాంటి ఇబ్బంది లేకుండా మెట్రో రైలు ఎక్కిందని ప్రశంసిస్తున్నారు. ఫన్నీ కామెంట్స్ కూడా వస్తున్నాయి. వరుడు లక్కీ.. నన్ను తీసుకెళ్లు అని ఆమె ఇబ్బంది పెట్టలేదు అని ఒకరు కామెంట్ చేశారు. థ్యాంక్యూ బెంగళూరు మెట్రో అని మరొకరు స్పందించారు.