E.G: కొవ్వూరు మున్సిపల్ హైస్కూల్లో జరిగిన యూటీఎఫ్ క్లస్టర్ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి పిల్లి జయకర్ పాల్గొన్నారు. విద్యారంగం, ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన విమర్శించారు. పీఆర్సీ, డీఏ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ‘రణభేరి 3.0’కు పిలుపునిచ్చారు. ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు.