అక్కినేని వారసుడు అఖిల్ మంచి హిట్టు కోసం ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నాడు. అఖిల్ సినిమాతో తన కెరీర్ ప్రారంభించాడు. కానీ మంచి హిట్టు మాత్రం ఇప్పటి వరకు పడలేదు. మధ్యలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మాత్రమే కాస్త పర్వాలేదనిపించింది. ఇటీవల విడుదలైన ఏజెంట్ అయితే కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఏజెంట్ డిజాస్టర్‌గా నిలిచింది.
ఏజెంట్ మూవీ విడుదలై చాలాకాలం అవుతున్నా ఓటీటీ లోకి రాలేదు. కానీ ఎట్టకేలకు దీనికి మోక్షం లభించింది అనుకునేలోపు మళ్లీ చిక్కులు వచ్చి పడ్డాయి. అఖిల్ నటించిన ఈ స్పై యాక్షన్ సినిమా ఏప్రిల్ 28న భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ టాక్‌కు తెరలేపింది. మొదటి వారాంతంలో కొనుగోలుదారులకు భారీ నష్టాలు రావడంతో ఇది థియేటర్ల నుండి కొట్టుకుపోయింది. మే నెలలో ఈ సినిమా స్ట్రీమింగ్ ప్రారంభం కానుందని సోనీ లివ్ ప్రకటించింది. కానీ అది నిరవధికంగా వాయిదా పడింది.
ఈ మూవీ విడుదలైన మూడు వారాలకే ప్రముఖ ఓటీటీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ రానున్నట్టు ప్రకటించినా ఆ తర్వాత వాయిదా వేశారు. తాజాగా ఈ సినిమా ఈ నెల 29న స్ట్రీమింగ్కు రానుంది. అయితే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కాకుండా కోర్టు స్టే విధించింది. విశాఖ పట్నానికి చెందిన ప్రముఖ పంపిణీదారుడు బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీష్) ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ విషయంలో అన్యాయం జరగిందన్నారు.
అఖిల్ ఏజెంట్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో నిర్మాత అనిల్ సుంకర తనని మోసం చేశారని పేర్కొంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఈ విషయమై దావా వేశారు. ఆయన వాదనలు విన్న తర్వాత ఈ నెల 29న ఏజెంట్ చిత్రం స్ట్రీమింగ్ కాకుండా స్టే ఇచ్చింది. ఈ విషయాన్ని సతీష్ బత్తుల లాయర్ మీడియాకు తెలిపారు.
ఇక ‘ఏజెంట్’ ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ స్ట్రీమింగ్ వేదిక ‘సోనీలివ్’ దక్కించుకుంది. థియేట్రికల్ రన్ పూర్తయిన ఎనిమిది వారాలకు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుందని ముందుగా తెలిపారు. ఇక ‘ఏజెంట్’లో అఖిల్ రిక్కీ అలియాస్ రామకృష్ణ అనే పాత్రలో నటించాడు. అఖిల్‌కు జంటగా సాక్షి వైద్య నటించింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా తేడా కొట్టడంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను ముందుకు జరిపారు. తీరా ఇపుడు నిర్మాతకు డిస్ట్రిబ్యూటర్‌కు గొడవతో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై కోర్టు స్టే విధించింది.