»Alia Bhatt Kissing Ranbir Kapoor Pic Post Insta Birthday Wishes
Ranbir kapoor:ను కిస్ చేసిన అలియా భట్..పిక్ వైరల్
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ఈరోజు 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన భార్య అలియా భట్‌తో సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Alia Bhatt kissing Ranbir kapoor pic post insta birthday wishes
బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ఈరోజు(సెప్టెంబర్ 28న) తన 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక రోజును గుర్తుచేసుకుంటూ అతని బెటర్ హాఫ్ అలియా భట్ పవర్ కొన్ని కొత్త చిత్రాలను అభిమానులను పంచుకుంది. మై లవ్, మై బెస్ట్ ఫ్రెండ్, మై హ్యాప్పీయెస్ట్ ప్లేస్ అంటూ తన ఇన్ స్టా ఖాతాలో పలు చిత్రాలను పోస్ట్ చేసింది. అయితే వాటిలోని మొదటి చిత్రంలో తన భర్త చెంప అలియా కిస్ చేయడం చూడవచ్చు.
ఆ తర్వాత ఫోటోలో ఇద్దరూ కలిసి స్టేడియంలో ఉన్నారు. మరో పిక్ వారి వివాహ వేడుకలకు సంబంధించింది. ఇలా రణబీర్‌తో ఉన్న ప్రత్యేకమైన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ అలియా అభిమానులతో పంచుకున్నారు. ఇది చూసిన నెటిజన్లలో పలువురు రణబీర్ కు విష్ చేస్తుండగా..మరికొంత మంది అయితే ఈ ఫోటో లోకేషన్ ఎక్కడ, ఎప్పుడు కిస్ చేశారనే ప్రశ్నలు సంధిస్తున్నారు.
మరోవైపు రణబీర్ సోదరి రిద్దిమా కపూర్ కూడా రాక్‌స్టార్ కు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అలియా పోస్ట్‌లోని కామెంట్ సెక్షన్లో ఆమె నాలుగు రెడ్ హార్ట్ ఎమోజీలను పోస్ట్ చేస్తూ ప్రకటించారు. ఆ క్రమంలో ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఆమె, రణబీర్ వారి తాత రాజ్ కపూర్లతో ఉన్న వీడియోను పోస్ట్ చేశారు. దీంతోపాటు రణబీర్ తల్లి నీతూ కపూర్ కూడా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పుట్టినరోజు అబ్బాయి అంటూ ఓ పాత ఫోటోను పోస్ట్ చేసి విష్ చేసింది. వీరితోపాటు ఇంకొంత మంది సినీ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రణబీర్ కపూర్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో యానిమల్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రం టీజర్ నేడు విడుదల కాగా..ఈ సినిమా డిసెంబర్ 1న పాన్ ఇండియా లెవల్లో థియేటర్లలోకి రానుంది.