బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ యాక్ట్ చేసిన 'యానిమల్' మూవీ టీజర్ ఎట్టకేలకు విడుదలైంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న కీలక పాత్రల్లో యాక్ట్ చేశారు.
ప్రముఖ బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ పుట్టినరోజున సందర్భంగా ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ వచ్చేసింది. రణబీర్ యాక్ట్ చేసిన ‘యానిమల్’ టీజర్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. రెండు నిమిషాల 26 సెకన్ల క్లిప్‌లో రణబీర్ కపూర్ యాక్టింగ్ మాములుగా లేదు. రష్మిక(గీతాంజలి), రణబీర్ సంభాషణతో టీజర్ మొదలవుతుంది. ఆ క్రమంలో నా తండ్రి ప్రపంచంలోనే బెస్ట్ అని రణబీర్ రష్మికతో అంటాడు. ఆ తర్వాత జ్యోతి మనం ఒక క్రిమినల్ ని కన్నామని తండ్రి పాత్రలో ఉన్న అనిల్ కపూర్ హీరోను కొడుతూ చెబుతుంటాడు. ఆ తర్వాత ఛేజింగ్స్, నేను చెడును వెంటాడుతూ వెళ్లాను, నా కెక్కడా కనపడలేదనే డైలాగ్ గుస్ బంప్స్ తెప్పిస్తుంది.
రణబీర్ కపూర్ పవర్-ప్యాక్డ్ పర్ఫామెన్స్ తో అద్భుతంగా నటించాడు. దీంతోపాటు డైలాగ్స్, ఫైట్స్ చూస్తే ఈ సినిమాపై మరింత ఉత్కంఠ పెరుగుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే టీజర్ మొత్తం పూర్తి ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీగా ఉంది. అర్జున్ రెడ్డి తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగా నుంచి మరో హిట్ వస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ చిత్రంలో రణబీర్ మొదటిసారిగా మాస్ రోల్ చేస్తున్నాడు. అయితే ఈ మూవీ సమస్యాత్మకమైన తండ్రి, కొడుకుల సంబంధం చుట్టూ తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఈ మూవీలో బాబీ డియోల్ విలన్‌గా యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో అనిల్ కపూర్, రష్మిక మందన, బాబీ డియోల్, ట్రిప్తి డిమ్రీ సహా పలువురు కీలక పాత్రల్లో యాక్ట్ చేశారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 1న విడుదల కానుంది.