»Good News For Singareni Workers And Employees 32 Percent Share In Profits
Singareni: సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు గుడ్న్యూస్..లాభాల్లో 32శాతం వాటా
సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రూ.2,222 కోట్ల లాభాల్లో 32 శాతం వాటాగా ఉద్యోగులు, కార్మికులకు రూ.711 కోట్లను ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
సింగరేణి (Singareni) కార్మికులకు తెలంగాణ (Telangana) సర్కార్ శుభవార్త చెప్పింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను సింగరేణి సంస్థ సాధించిన లాభాల్లో 32 శాతం వాటాను కార్మికులు, ఉద్యోగులకు చెల్లించనున్నట్లు సీఎం కేసీఆర్ (CM KCR) తెలిపారు. ఈ మేరకు ఆదేశాలను కూడా జారీ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ రూ.2,222 కోట్ల లాభాలను ఆర్జించింది. రికార్డు స్థాయిలో ఇలాంటి లాభాలను సాధించడం సంతోషంగా ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు.
సాధించిన లాభాల్లోంచి రూ.700 కోట్లకు పైగా నగదును దసరా (Dasara) ముందుగానే సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు (Singareni Workers) ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ఇదివరకే హామీ ఇచ్చారు. రెండు నెలల కిందట మంచిర్యాలలో సీఎం కేసీఆర్ ఈ హామీపై ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన మాట ప్రకారం 32 శాతాన్ని అంటే వాటాగా రూ.711 కోట్లను ప్రభుత్వం ఇవ్వడానికి ఆదేశాలు జారీ అయ్యాయి.
గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు. ఇప్పటి వరకూ లేనివిధంగా సింగరేణి కార్మికులకు, ఉద్యోగులకు లాభాల్లో వాటాలు వస్తుండటంతో సింగరేణి కార్మికులు, ఉద్యోగులు (Singareni Workers) హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) సర్కార్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.