ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ విజయం సాధించాడు. మూడో రౌండ్ లోకి జకోవిచ్ ప్రవేశించాడు. గురువారం జరిగిన రెండో రౌండ్ పోరులో జకోవిచ్ ఫ్రాన్స్ కు చెందిన ఎంజో కౌకాడ్ పై విజయం సాధించాడు. మొదటి రౌండ్ లో అలవోకగా గెలిచిన జకో ఆ తర్వాత రెండో రౌండ్లో మాత్రం కాస్త తడబడ్డాడు. ఆ తర్వాత కాస్త స్పీడ్ పెంచి మూడో రౌండ్ కి చేరాడు.
పురుషుల సింగిల్స్ లో అలెగ్జాండర్ జ్వెరెవ్ ను అమెరికాకు చెందిన మైకేల్ ఎమ్మో మట్టికరిపించాడు. మహిళల సింగిల్స్ లో జాబెర్ కు విజయం దక్కలేదు. ఇకపోతే మహిళల డబుల్స్ లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా దూసుకుపోయింది. తొలి రౌండ్ లో కజకిస్థాన్ క్రీడాకారిణి డానిలినాతో కలిసి సానియా బరిలోకి దిగింది. సానియా, డానిలినా జోడి విజయం సాధించి రెండో రౌండ్ లోకి చేరారు.