Bandi Sanjay: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హీటు పెరిగింది. షెడ్యూల్ రాకున్నప్పటికీ.. నేతల పర్యటనలు, కామెంట్స్ అలానే ఉన్నాయి. సీఎం కేసీఆర్పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో గెలిచేందుకు సీఎం కేసీఆర్ ఏమైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని.. ఎమ్మెల్యేలు జర జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు.
సీఎం కేసీఆర్ తాంత్రిక పూజలు చేస్తున్నారని బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు పూజలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. కొందరు ఎమ్మెల్యేలకు కేసీఆర్ నిమ్మకాయలు ఇస్తున్నారని గుర్తుచేశారు. మీరు జాగ్రత్తగా ఉండాలని బండి సంజయ్ సూచించారు. ఇతరులు నాశనం కావాలని సీఎం కేసీఆర్ కోరుకుంటున్నారని తెలిపారు. డబ్బులతో రాజకీయం చేస్తున్నారని విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ పార్టీలో సీఎం కేసీఆర్ కోవర్టులు ఉన్నారని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ పార్టీలో కులాల కొట్లాటను కేసీఆర్ పెట్టిస్తున్నారని తెలిపారు. అక్కడ ఎవరూ గెలిచినప్పటికీ కేసీఆర్ వద్దకు వెళ్తారని పేర్కొన్నారు. జాగ్రత్తగా ఉండాలని ఆ పార్టీ నేతలకు సూచించారు. జరిగిన, జరుగుతోన్న పనులను చూసి యువత క్షమించదని బండి సంజయ్ అన్నారు.
బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆ పార్టీ మంచి ఊపు మీద ఉండే. కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత ఊలుకు లేదు పలుకు లేదు. మీటింగ్, పీసీ ఉంటే నేతలు వస్తున్నారు.. మాట్లాడుతున్నారు వెళ్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పార్టీ గురించి, చేసే మంచి గురించి మాత్రం చర్చించడం లేదు. పరిస్థితి ఇలానే ఉంటే.. గత ఎన్నికల్లో ఒక సీటు రాగా.. ఇప్పుడు అదీ కూడా రాదని కొందరు ఆనలిస్టులు అంచనా వేశారు.