NLR: సైదాపురం మండలం చాగణం గ్రామానికి చెందిన మణికంఠ 3 రోజుల నుంచి కనపడకుండా పోయిన విషయం తెలిసిందే. పోలీసులు గాలింపు చర్యల్లో భాగంగా శుక్రవారం యువకుడు బైక్ జోరేపల్లి తెలుగు గంగ కాలువ దగ్గర ఉన్నట్టు గుర్తించారు. మణికంఠ మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.