»Warning For 16 Districts Of Telangana Meteorological Department Alert
Rain Alert: తెలంగాణలోని 16 జిల్లాలకు హెచ్చరిక..వాతావరణ శాఖ అలర్ట్
తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, 16 జిల్లాల్లోని ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శుక్రవారం సాయంత్రం నుంచి పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తెలంగాణలోని 16 జిల్లాలకు హెచ్చరిక జారీ చేసింది. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలతో పాటుగా నిజామాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
హైదరాబాద్‌తో పాటుగా 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, 16 జిల్లాల్లోని ముంపు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.