»Viral Video Shows Ecuador Drug Cartel Buried With Lots Of Machine Guns To Protect Himself In The Afterlife
Viral Video: చచ్చినా వీడిని ఎవరూ చంపలేరు.. భయం లేకుండా మెషిన్ గన్లతో పాతిపెట్టారు
సోషల్‌మీడియాలో ఓ విచిత్రమైన వీడియో తెగ వైరల్ వైరల్ అవుతోంది. దానిని చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఒక వ్యక్తిని ఖననం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు వీడియోలో చూడవచ్చు.
Viral Video: సోషల్‌మీడియాలో ఓ విచిత్రమైన వీడియో తెగ వైరల్ వైరల్ అవుతోంది. దానిని చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఒక వ్యక్తిని ఖననం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు వీడియోలో చూడవచ్చు. అయితే అక్కడున్న వారంతా పదుల సంఖ్యలో అత్యాధునిక ఆయుధాలతో మృతదేహాన్ని కప్పి పాతిపెడుతున్నారు. ఇలా చేయడం వెనుక కారణం తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఈ షాకింగ్ దృశ్యం ఈక్వెడార్‌లో జరిగింది.
మృతుడు 39 ఏళ్ల మాన్యుయెల్ జూలియన్ సెవిల్లానో బస్టామంటే, ‘లాస్ ఫాటేల్స్’ గ్రూప్‌కు అధిపతిగా గుర్తించారు. వీరిది క్రిమినల్ గ్యాంగ్. ఈ గ్యాంగ్ ఈక్వెడార్‌లోని లాస్ రియోస్ ప్రాంతంలో పనిచేస్తుంది. దక్షిణ అమెరికా దేశంలో డ్రగ్స్‌తో వ్యవహరిస్తుంది. సెప్టెంబర్ 13 మధ్యాహ్నం బస్టామంటే తన 20 ఏళ్ల కుమార్తె, క్యూరిటీ గార్డుతో కలిసి మోకాష్లో తన కారును కడగడానికి ఆపారు. ఆ సమయంలో దుండగలు వీరిపై కాల్పులు జరిపారు. ఈ విచక్షణారహిత కాల్పుల్లో డ్రగ్స్ మాఫియా కుమార్తెపై కూడా కాల్పులు జరిపారు. వారిద్దరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. బస్టామంటే తరచూ తన కారును స్వయంగా కడుగుతున్నాడని తెలిసిన దుండగులు ప్లాన్ చేసి అటాక్ చేశారు.
ఆయుధాలతో పాతిపెట్టడానికి ఇదే కారణం
వైరల్ అయిన క్లిప్‌లో వ్యక్తులు శవపేటికలో మృతదేహంపై షాట్గన్లు, రైఫిళ్లు, రివాల్వర్లు, ఇతర ఆయుధాలను ఉంచడం చూడవచ్చు. ఇలా చేయడం వల్ల వచ్చే లోకంలో తాను సురక్షితంగా ఉండగలడని కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు.
ఆరు నెలల్లో 3568 మరణాలు
ఈక్వెడార్‌లో డ్రగ్స్ మాఫియాల మధ్య గ్యాంగ్ వార్ సంఘటనలు వేగంగా పెరిగాయి. గత ఏడాది రక్తపాత ఘర్షణల్లో 4600 మందికి పైగా మరణించారు. ఇది 2021లో రెట్టింపు. ఈ ఏడాది ఆగస్టు వరకు గ్యాంగ్ వార్‌లో 3568 మంది చనిపోయారు.