»Central Telecom Department Send Emergency Alert Message To All Phones Not To Worry
Emergency alert: ఫోన్లకు ఎమర్జెన్సీ అలర్ట్ మేసెజ్..ఆందోళన వద్దని సూచన
చాలా మంది స్మార్ట్ఫోన్ వినియోగదారులకు ఈరోజు అత్యవసర హెచ్చరిక (emergency alert) పేరుతో ఓ మేసెజ్ వచ్చింది. అయితే ఇది చూసిన అనేక మంది యూజర్లు ఏదైనా హ్యాకింగా లేదా మేసెజ్ ఎందుకు వచ్చిందని ఆందోళన చెందారు. అయితే ఇది భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం ద్వారా పంపబడిన టెస్ట్ సందేశమని భయాపడాల్సిన పనిలేదని అధికారులు పేర్కొన్నారు.
central telecom department send Emergency alert message to all phones Not to worry
ఈరోజు చాలా మంది ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు ‘అత్యవసర హెచ్చరిక(emergency alert) పేరుతో ఓ మెసేజ్ వచ్చింది. మెసేజ్ రాగానే ఫోన్ కాసేపు బీప్ వచ్చింది. అయితే దీనిపై అనేక మంది యూజర్లు ఆందోళన చెందారు. అసలు ఎందుకు అలా వచ్చింది. ఫోన్ ఏమైనా హ్యాక్ అయ్యిందా లేదా ఎందుకు పంపించారని అనేక మంది తెలియకుండానే అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఈ అంశంపై భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం క్లారిటీ ఇచ్చింది. ఇది ప్రభుత్వం పరీక్షించిన ‘అత్యవసర హెచ్చరిక వ్యవస్థ’ అని తెలిపింది.
బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్ ద్వారా పంపబడిన టెస్ట్ సందేశమని దీని గురించి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఎందుకంటే మీ వైపు నుంచి ఎటువంటి చర్య అవసరం లేదని చెప్పింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అమలు చేస్తున్న TEST Pan-India ఎమర్జెన్సీ సందేశమని పేర్కొంది. ఇది ప్రజల భద్రతను మెరుగుపరచడం కోసం అత్యవసర సమయంలో సకాలంలో హెచ్చరికలను అందించడమే లక్ష్యంగా టెస్ట్ మెసేజ్ పంపినట్లు వెల్లడించింది. మొబైల్ ఆపరేటర్లకు అత్యవసర హెచ్చరిక సామర్థ్యాల ప్రభావాన్ని అంచనా వేయడానికి..వివిధ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు ఇటువంటి పరీక్షలు నిర్వహించబడతున్నాయని టెలికమ్యూనికేషన్ విభాగం తెలిపింది. ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీతో కలిసి పని చేస్తోంది. భూకంపాలు, సునామీలు, ఆకస్మిక వరదలు వంటి విపత్తుల సమయంలో ఇది ఉపయోగించబడుతుంది. అయితే దీనిని అనేక ప్రాంతాల్లో ఆగస్టు 17 నుంచే ప్రారంభించినట్లు చెప్పారు. ఒక్కో ప్రాంతంలోని వ్యక్తులకు ఒక్కోరోజు వస్తుందని దీనిపై భయాందోళన వద్దని అధికారులు సూచించారు.