»Owaisi Opposed The Womens Reservation Bill Fight With Obc And Women Muslim Reservation
Owaisi: మహిళా రిజర్వేషన్ బిల్లును అందుకే వ్యతిరేకించా
లోక్సభలో నిన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు(women's reservation bill) వ్యతిరేకంగా ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ(Owaisi), ఆయన పార్టీ ఎంపీ ఇంతియాజ్ జలీల్ ఇద్దరు కూడా వ్యతిరేకంగా ఓటు వేశారు. మిగతా అన్ని పార్టీల ఎంపీలు మద్దతిచ్చిన బిల్లుకు వీరు ఎందుకు వ్యతిరేకంగా ఓటు వేశారో కూడా స్పష్టం చేశారు. అయితే ఆ విషయమెంటో ఇప్పుడు చుద్దాం.
Owaisi opposed the Women's Reservation Bill fight with obc and women muslim reservation
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు(womens reservation bill)కు బుధవారం లోక్సభలో 454 మంది సభ్యులు నారీ శక్తి వందన్ అధినియం బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. కానీ ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ(Owaisi), ఆయన పార్టీ ఎంపీ ఇంతియాజ్ జలీల్(imtiaz jaleel) ఈ బిల్లును ఖండిస్తు వ్యతిరేకంగా ఓటు వేశారు. అయితే ఈ ఇద్దరు ఎంపీలు వ్యతిరకంగా ఓటు వేసిన కారణాన్ని వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కేవలం అగ్రవర్ణ మహిళలకు మాత్రమే రిజర్వేషన్ కల్పిస్తుందని వ్యతిరేకించినట్లు స్పష్టం చేశారు. భారతదేశంలో OBCల జనాభా 50 శాతం కంటే ఎక్కువ. కానీ లోక్సభలో వారి ప్రాతినిధ్యం 22 శాతం. భారతదేశంలో ముస్లిం మహిళల జనాభా 7 శాతం. లోక్సభలో వారి ప్రాతినిధ్యం 0.7 శాతం. కాబట్టి వీరికి ప్రాతినిధ్యం కల్పించలేరా అని ఒవైసీ ప్రశ్నించారు.
ఈ బిల్లు వెనుక ఉద్దేశ్యం లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు(womens) ప్రాతినిధ్యం కల్పించడమే. అయితే ఓబీసీ, ముస్లిం మహిళలకు ఎందుకు ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఈ మోడీ ప్రభుత్వం అగ్రవర్ణ మహిళలకు ప్రాతినిధ్యం పెంచాలని చూస్తోందని ఓవైసీ వ్యాఖ్యానించారు. మరి ఓబీసీ మహిళలు, ముస్లిం మహిళలకు ప్రాతినిధ్యం అక్కర్లేదా అంటూ ఎద్దేవా చేశారు. ముస్లిం మహిళలు ద్వంద్వ వివక్షను ఎదుర్కొంటున్నారని, ముస్లిం, ఓబీసీ మహిళలకు రావాల్సిన వాటాను అధికార బీజేపీ నిరాకరించిందని ఒవైసీ ఆరోపించారు. ఈ బిల్లు ఒక మోసపూరిత బిల్లు అని ఆయన విమర్శించారు.
ఇక లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బుధవారం పార్లమెంటు దిగువ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు తదుపరి జనాభా గణన పూర్తయిన తర్వాత చేపట్టే లోక్సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ తర్వాత ఇది అమల్లోకి వస్తుంది. ఈ బిల్లును నేడు రాజ్యసభ(rajya sabha)లో ప్రవేశపెట్టనున్నారు.