సినిమా ఇండస్ట్రీని వదిలిపెట్టిన తర్వాత రాజకీయంగా బిజీ అవుతున్నారు చాలా మంది సెలబ్రీటీస్. తాజాగా టాలీవుడ్ వెటరన్ హీరో మళ్లీ కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యాడు.
ప్రస్తుతం తెలుగు హీరోలను తీసుకుంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఫుల్ బిజీగా ఉన్నాడు. జనసేన పార్టీ స్థాపించిన పవన్.. వచ్చే ఎలక్షన్స్‌లో టీడిపితో కలిసి వెళ్తానని ఇటీవలె కన్ఫామ్ చేశారు. ఇక ఒక్క పవనే కాదు.. టాలీవుడ్లో రాజకీయం చేస్తున్న వారు చాలామందే ఉన్నారు. తాజాగా ఒకప్పటి హీరో రాజా కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రాజా.. శ్రీకాంత్ హీరోగా వచ్చిన ‘ఓ చిన్నదాన’ సినిమాతో నటుడిగా కెరీర్ మొదలు పెట్టాడు. హీరోగా ‘వెన్నెల’ సినిమాతో గుర్తింపు వచ్చింది.
పార్వతి మెల్టన్, రాజా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా.. హీరోహీరోయిన్లకి మంచి అవకాశాలు తెచ్చిపెట్టింది. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఆనంద్ సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకున్న రాజా.. ఆ తర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో సినిమాలకు దూరమయ్యాడు. గతంలో ఓసారి వైఎస్ మీద ఉన్న అభిమానంతో కాంగ్రెస్ పార్టీలో చేరి, ఆయన మరణం తరువాత పార్టీ నుండి బయటికి వచ్చాడు. ఆ తర్వాత పాస్టర్ అయ్యాడు.
ప్రస్తుతం పాస్టర్‌గా దైవ సేవలో మునిగి తేలుతున్నాడు. అయితే ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు రాజా. విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు సమక్షంలో ఆయన తిరిగి సొంత గూటికి చేరారు. ఈ క్రమంలో రాజా మాట్లాడుతూ.. నాకు కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యే అవకాశం ఇచ్చినందుకు సంతోషం అని అన్నారు. రాజకీయ పదవులు ఇస్తారు కానీ ఆశిస్తే రావని రాజా పేర్కొన్నారు.