శ్రీకాకుళానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు పోలీస్, ఆర్మీ రంగాల్లో చేరారు. ఒకరు డీఎస్పీ కాగా మరొకరు మేజర్ పదవీ నిర్వహిస్తూ.. ఆ రంగాల్లో వచ్చే అమ్మాయిలకు ఆదర్శంగా నిలిచారు.
Elder is DSP, Younger is major.. sisters who are inspiring
Sisters: జనరేషన్ మారింది. ఆడ, మగ అనే తేడా లేదు. అన్నింటిలో మేమున్నాం అంటూ వస్తున్నారు అమ్మాయిలు. అబ్బాయిలకు సమానంగా కాంపిటీషన్ ఇస్తున్నారు. పేరంట్స్ ఆలోచన సరళి కూడా మారింది. పిల్లలు ఏదీ చెబితే.. దానికి ఓకే అంటున్నారు. ఫస్ట్ కొంచెం.. ఇబ్బంది పడినప్పటికీ.. తర్వాత మాత్రం ఒప్పుకుంటున్నారు. మారుమూల.. సిక్కోలుకు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు (Sisters) మిగతా వారికి స్ఫూర్తిగా నిలిచారు. ఇంతకీ వారెం చేశారో తెలుసుకోవాలనుందా.? అయితే ఈ స్టోరీ చూడండి.
సమానం
అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు చదువుతున్నారు. ఆటలు ఆడుతున్నారు. మంచి మంచి జాబ్స్ కొడుతున్నారు. చివరికీ శాంతి భద్రతలు నిర్వహించే పోలీస్.. సరిహద్దులో దేశం కోసం గస్తీ కాచే ఆర్మీలో కూడా చేరుతున్నారు. అబ్బాయిల కన్నా మేం ఏం తక్కువ కాదని చెబుతున్నారు. శ్రీకాకుళం ఆముదాల వసలకు చెందిన అప్పారావు, సుగుణవేణి దంపతులకు ఇద్దరు కూతుళ్లు.. ప్రదీప్తి, ప్రతిభ. తమకు అమ్మాయిలే ఉన్నారని ఆ పేరంట్స్ ఏ రోజు బాధపడలేదు. పైగా సంతోష పడ్డారు. ఇప్పుడు గర్వ పడుతున్నారు.
స్వేచ్చ
చిన్నప్పటి నుంచి పిల్లలకు స్వేచ్చ ఇచ్చారు. ఏం చదువుకుంటామంటే వద్దనలేదు. కొన్నిసార్లు విభేదించినా కన్విన్స్ చేసేసరికి అంగీకరించారు. పెద్దమ్మాయి పోలీస్ జాబ్ చేస్తానని చెప్పగా.. చిన్నమ్మాయి ఏకంగా డిఫెన్స్‌లో చేస్తానని చెప్పింది. దీంతో కొంత మదన పడ్డారు. ఆలోచించారు. చివరకు పిల్లలు చెప్పిన రంగంలో రాణించేందుకు అంగీకరించారు. ఇద్దరూ బీటెక్ పూర్తి చేశారు. తర్వాత ఫిట్ నెస్ కోసం గ్రౌండ్లో సాధన చేశారు. అప్పుడు కూడా అండగా నిలిచారు. 2020లో ప్రదీప్తి గ్రూప్-2 రాసి సక్సెస్ అయ్యింది. ఆమె ఆశించినట్టు ఎక్సైజ్ శాఖలో ఎస్సై ఉద్యోగం సాధించింది. విధులు నిర్వహిస్తూనే.. గ్రూప్-1 రాసింది. అందులో కూడా ఎంపికై.. ఇప్పుడు డీఎస్పీగా పనిచేసే అవకాశం వచ్చింది.
డీఎస్పీ- మేజర్
పెద్దమ్మాయి ప్రదీప్తి తాను అనుకున్నట్టు మంచి అవకాశం వచ్చింది. డీఎస్పీ స్థాయిలో ఉంది. చిన్నమ్మాయి ప్రతిభ తక్కువేం కాదు.. ఆర్మీలో పనిచేసే అన్నయ్య ఉన్నారు. సైన్యంలో చేరొచ్చని ఆయన చెప్పారట.. దీంతో ఆమెకు ఎక్కడలేని ధైర్యం వచ్చింది. రెండుసార్లు ప్రయత్నించి.. ఫెయిల్ అయ్యింది. 2015లో లెప్టినెంట్గా భారత సైన్యంలో చేరింది. ప్రస్తుతం సౌత్ సుడాన్లో శాంతి స్థాపన కోసం దేశం తరఫున పనిచేస్తున్నారు. ప్రతిభ ప్రస్తుతం ఆర్మీలో మేజర్ ర్యాంక్ అధికారిగా ఉన్నారు. ఆమె అనుకున్న లక్ష్యానికి చేరింది. అక్క డీఎస్పీ స్థాయి అధికారి కాగా.. చెల్లి మేజర్ అయ్యింది. దీంతో వారి పేరంట్స్ ఆనందానికి హద్దు లేకుండా పోయింది.
గర్వంగా ఉంది
పిల్లల గురించి చెబుతోన్న సమయంలో చాలా గర్వపడుతామని అప్పారావు దంపతులు చెబుతారు. తొలుత భయం వేసిందని.. కానీ వారు అనుకున్న లక్ష్యంతో ముందడుగు వేయడంతో తృప్తి కలుగుతుందని వివరించారు. తమ పిల్లలు ఇతరులకు ఆదర్శంగా నిలిచారని.. పలువురు ఇదే విషయం మాట్లాడుతుంటే గర్వంగా ఉందని తెలిపారు. నిజమే.. ఆడాళ్లు, జాబ్ ఎందుకని కొందరు అంటుంటారు. కానీ అప్పారావు కపుల్స్ మాత్రం ఆర్మీ, పోలీసు డిపార్ట్మెంట్లోకి తమ కూతుళ్లను పంపించారు. అమ్మాయిలు అనే మాట్లాడేవారికి చేతలతో సమాధానం చెప్పారు. ఆయా రంగాల్లోకి రావాలని అనుకునేవారికి స్ఫూర్తిగా నిలిచారు. నిజంగా వీరు గ్రేట్ అని స్థానికులు ప్రశంసిస్తున్నారు.