Voter Enrollment: మొబైల్లో ఓటరు నమోదు చేసుకోండిలా!
సార్వత్రిక ఎన్నికల్లో అర్హులైన పౌరులు ఓటుకి అప్లై చేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఓటుకి అప్లై చేసుకోవడానికి గడువు తేదీ ఏప్రిల్ 15తో ముగియనుంది. 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులు ఓటర్లు జాబితాలో పేరు నమోదు చేసుకోవచ్చు.
Voter Enrollment: సార్వత్రిక ఎన్నికల్లో అర్హులైన పౌరులు ఓటుకి అప్లై చేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఓటుకి అప్లై చేసుకోవడానికి గడువు తేదీ ఏప్రిల్ 15తో ముగియనుంది. 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులు ఓటర్లు జాబితాలో పేరు నమోదు చేసుకోవచ్చు. ఇప్పటికీ ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే వెంటనే మీ మొబైల్లో https://voters.eci.gov.in/ ఈ లింక్‌తో అప్లై చేసుకోండి. కొత్త ఓటరుతో పాటు ఓటరు జాబితాలో పేరు లేనివాళ్లు, అర్హత ఉండి కూడా ఓటు హక్కు రాని వాళ్లు కూడా ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.
తర్వాత మీ పేరు ఎంటర్ చేశాక.. నచ్చిన పాస్వర్డ్ పెట్టుకోండి. మీఫోన్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ ఈడీ ఎంటర్ చేసి మీ పాస్వర్డ్ ఎంటర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తే మళ్లీ మీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత కొత్త ఓటరుగా నమోదు చేయించుకొనేందుకు ఫారం-6ను పూర్తి చేయాలి. దీనికోసం పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, అడ్రస్, పుట్టిన తేదీని ధ్రువీకరించే పత్రాలు ఉంటే సరిపోతుంది. తర్వాత డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి, కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసి సబ్మిట్ చేస్తే ఓటు నమోదు ప్రక్రియ పూర్తవుతుంది.