»Woman Had All 4 Limbs Amputated After Eating Fish With Deadly Bacteria Almost Lost Her Life
Viral News: చేప తిని కాళ్లూచేతులు పోగొట్టుకున్న మహిళ
బాక్టీరియా సోకిన చేప తిని ఓ మహిళా కాళ్లూచేతులు పోగొట్టుకుంది. స్థానికంగా దొరికే చేపలను వండుకొని తినింది. తరువాత అనారోగ్యం పాలు కావడంతో వైద్యులు తీవ్రంగా శ్రమించి ఆమే ప్రాణాలను కాపాడారు. తన అవయవాలను పోగొట్టుకుంది.
Woman had all 4 limbs amputated after eating fish with deadly bacteria Almost lost her life
Viral News: మాములుగా అందరికి చేపలు అన్నా సీ ఫుడ్(Sea Food) అన్నా చాలా ఇష్టం ఆ ఆహారానికి ప్రత్యేకమైన భోజనప్రియులు ఉంటారు. అయితే ఈ విషయం తెలిసిన తరువాత సీ ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటంలో తప్పు లేదు అనిపిస్తుంది. ఈ మహిళా చేపను తిని తన అవయవాలను పోగొట్టుకుంది. ఈ విషాద ఘటన అమెరికా(USA)లోని కాలిఫోర్నియాలో జరిగింది. బాక్టీరియా సోకిన చేపను సరిగా ఉడికించకపోవడంతో ఓ మహిళ తన రెండు కాళ్లూచేతులు కోల్పోయింది. అలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన అమెరికాలో ఓ ప్రపకంపనం సృష్టించిందంటే అతిశయోక్తి కాదు. పూర్తి వివరాల్లోకి వెళితే..
40 ఏళ్ల లారా బరాజాస్ అనే మహిళకు విబ్రియో వల్నిఫికస్ అనే అత్యంత ప్రాణాంతక బాక్టీరియా వ్యాపించింది. ఆ బాక్టీరియా సముద్ర ఆహారం, సముద్ర నీటిలో మాత్రమే ఉంటుంది. కాలిఫోర్నియాలోని స్థానిక మార్కెట్లో కొనుగోలు చేసిన టిలపియా చేప(tilapia fish) తిన్న తర్వాతే ఆమె అనారోగ్యానికి గురయ్యారని తన స్నేహితురాలు అన్నా మెస్సినా మీడియాకు తెలిపింది. ఆ ఫుడ్ తీసుకున్న తరువాత తాను ఆనారోగ్యంపాలు అయినట్లు పేర్కొంది. వెంటనే ఆసుపత్రికి తరలించాగా.. వైద్యులు ప్రాణాలు కాపాడరని, లేదంటే తాను చనిపోయేది అని వెల్లడించింది. ప్రస్తుతం లారా డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉందని, తనకు ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పింది. ఆమె కింది పెదవి, వేళ్లు, పాదాలు నల్లగా మారాయని, కిడ్నీల పనితీరు దెబ్బతిందని. శరీరం మొత్తం విషపూరితంగా మారిపోయిందని, తనను ఆ పరిస్థితుల్లో చూసి బతకదేమో అన్నుకున్నట్లు మెస్సినా ఆవేదన వ్యక్తం చేశారు.
లారా కొద్దికాలం పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉందని, ఆ తరువాత ఆమెకు అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్స చేశారని తెలిపింది. ప్రాణాలు కాపాడేక్రమంలో వైద్యులు ఆమె కాళ్లూచేతులు తొలగించారని చెప్పెంది. అయితే సముద్రంలో నివసించే రెండు రకాలుగా ఈ బాక్టీరియా మనుషులకు సోకుతుందని. ఒకటి ఆహారం, రెండు నీరు అని యూసీఎస్ఎఫ్కు చెందిన అంటువ్యాధుల విభాగం నిపుణులు డాక్టర్ నటాషా తెలిపారు.