మధ్య ఆఫ్రికా దేశమైన కాంగో(Congo)లో భారీ కొండచరియలు విరిగిపడి 17 మంది మృతి చెందారు. వాయువ్య మంగల ప్రావిన్స్‌లోని లిసాన్ ప్రాంతాల్లో కుండపోత వర్షాల (Torrential rains) ధాటికి ఒక్కాసారిగా కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి. కొండ కింది ప్రాంతాల్లో ఉన్న ఇండ్లపై మట్టిపెళ్లలు, బండరాళ్లు పడటంతో 17 మంది దుర్మరణం చెందారు. దీంతో శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.కుంభవృష్టి కురవడంతో భారీగా నష్టం వాటిళ్లిందని మంగల గవర్నర్ సీజర్ లింబయా మంగిసా (Gov. Cesar Limbaya Mbangisa) వెల్లడించారు.
కొండ కింది ప్రాంతాల్లో ఉన్న నివాస గృహాలను కప్పేసాయి. దీంతో పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వారు తెలిపారు. వాయువ్య మంగల ప్రావిన్స్(Mangala Province)లోని లిసాల్ పట్టణంలో.. కాంగో నది తీరప్రాంత పరిసరాల్లో ఈ ఘటన జరిగింది.ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. శిథిలాల్లో చిక్కుకున్నవారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రావిన్స్ అంతటా మూడు రోజులపాటు సంతాప దినాలు ప్రకటించారు.