Rain Alert: ఏపీకి అలర్ట్.. భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు అంతర్జాతీయ వాతావరణ శాఖ పలు జిల్లాలను హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతి వాతావరణ కేంద్రం సూచించింది.
ఏపీ ప్రజలకు అంతర్జాతీయ వాతావరణ కేంద్రం (International Meteorological Center) హెచ్చరిక జారీ చేసింది. దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని, ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)లో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (Weather Department) వెల్లడించింది.
పార్వతీపురం మన్యం, శ్రీసత్యసాయి, అల్లూరి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలు సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ (Amaravathi Weather department) తెలిపింది. ప్రస్తుతం ఈశాన్య రుతుపవనాలు దక్షిణ భారతదేశం వైపు వీస్తున్నాయని, వాటి వల్ల రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Rain) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ప్రస్తుతం బంగాళాఖాతం, అరేబియా మహాసముద్రంలో అల్పపీడన ద్రోణి ప్రభావం కొనసాగుతోందని, వీటి వల్ల దేశవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ (IMD) వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ జిల్లా (Rayalaseema Districts)ల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ (Weather Department) తెలిపింది.