రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై వివరించేందుకు త్వరలోనే ఢిల్లీకి వెళ్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తెలిపారు. టీడీపీతో పొత్తు అంశంపై అమిత్షా, జేపీ నడ్డాకు వివరిస్తా అని పవన్ అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన (Janasena) కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. మరోసారి జగన్ గెలిస్తే ప్రజలు భరించగలరా అని ప్రశ్నించారు. ఏపీని సీఎం జగన్ (CM Jagan) చెర నుండి విముక్తి చేయాలన్నారు. ఇప్పుడు జగన్కు వత్తాసుపలికే పోలీసులు ఒకసారి ఆలోచించుకోవాలని హెచ్చరించారు. పోలీసులు (Police) తాము చేస్తున్నది సబబేనా అని ప్రశ్నించుకోవాలని సూచించారు.
ప్రతిపక్ష నేతలపై ఇంకా ఎన్ని కేసులు పెడతారని.. కేసులు పెడితే తాము భయపడిపోతామా అని నిలదీశారు. సీఎం పదవి ఉందని ఓ తెగ ఫీలైపోవద్దని.. ప్రజలకు కోపం వస్తే కొట్టి చంపేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నువ్వేమైనా పై నుంచి దిగొచ్చావా అని అని ప్రశ్నించారు. నువ్వేంత.. నీ బతుకెంత.. నీ స్థాయి ఎంత అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ ఒక మానసిక రోగి అని.. ఎయిమ్స్ (AIIMS) నుండి ఒక మంచి డాక్టర్ను పంపించి.. చెకప్ చేయించాలని ఎద్దేవా చేశారు. వైసీపీ(YCP) ని ఏపీ నుండి పంపించడానికి ఇదే మంచి సమయమని పవన్ అన్నారు. 2014లో పార్టీ పెట్టినప్పుడు ఒక్కడినే ఉన్నా..నా పక్కనా ఎవరు లేరని పవన్ అన్నారు.ఆ రోజున చనిపోవడానికి సిద్దమై పార్టీ పెట్టనని పవన్ అన్నారు