టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) నాయుడు నిర్ధోషిగా బయటకు వస్తారని నారా బ్రాహ్మిణి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి(Rajahmundry)లో నిర్వహించిన కొవ్వత్తుల ర్యాలీలో భువనేశ్వరితో పాటు పాల్గొన్నారు.ఎన్నికల్లో లబ్ధి కోసమే చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేశ్‌కు వస్తున్న మద్దతు చూసి ఇలాంటివాటికి పాల్పడ్డారని బ్రాహ్మిణి (Brahmin) ఆగ్రహం వ్యక్తం చేశారు. 42 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేతను జైల్లో పెట్టడం దారణమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఆయన చాలా అభివృద్ధి చేశారని బ్రాహ్మిణి గుర్తు చేశారు.చంద్రబాబు అరెస్టును దేశమంతా ఖండిస్తోంది.
ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్నారు. జాతీయ నేతలు కూడా ఏపీ ప్రభుత్వ వైఖరిని విమర్శించారు. న్యాయ వ్యవస్థ(Legal system)పై మాకు నమ్మకం ఉంది. బాబు ఎప్పుడూ ప్రజల కోసమే కష్టపడేవారు. ఆయనకు మద్దతు తెలుపుతున్న ప్రజలకు నా ధన్యవాదాలు. న్యాయవ్యవస్థపై మాకు విశ్వాసం ఉంది. ఆయన నిర్దోషిగా బయటకు వస్తారనే నమ్మకం ఉంది’’ అని బ్రాహ్మణి తెలిపారు.కోర్టులపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తారని తామేప్పుడు అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐడీ దాఖలు చేసిన చార్జ్ షీట్(Charge sheet)లో ఏమి లేదని ఎనిమిదేళ్ల దేవాన్ష్‌ను అడిగిన చెబుతాడని బ్రాహ్మిణి సెటైర్ వేశారు. యువతకు ఉద్యోగాలు కల్పించడమే తప్పా అని నారా బ్రాహ్మిణి నిలదీశారు.