»Delicious Dishes At Hyderabad Congress Cwc Meeting
CWC Meeting:లో నోరూరించే 78 రకాల వంటకాలు
హైదరాబాద్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటి సమావేశానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అందులో తెలంగాణ ఫేమస్ వంటకాలను ప్రత్యేకంగా వడ్డిస్తున్నారు. మొత్తం 78 రకాల వంటకాలను ఈ సమావేశంలో స్పెషల్గా వడ్డిస్తున్నట్లు తెలిసింది. అవెంటో ఇప్పుడు చుద్దాం.
Delicious dishes at Hyderabad Congress CWC meeting
CWC meeting: హైదరాబాద్(Hyderabad) వేదికగా శనివారం నుంచి రెండు రోజుల పాటు జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యుసీ) సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఈ భేటీకి కాంగ్రెస్ లోని కీలక నేతలంతా హాజరుకానున్నారు. రాజధానిలోని తాజ్ కృష్ణ ఫైవ్ స్టార్ హోటల్లో జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) సమావేశాల కోసం తెలంగాణ రాష్ట్ర నాయకత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల కాంగ్రెస్(Congress) నేతలు హాజరు అవుతుండడంతో వారికోసం ప్రత్యేక ఏర్పాట్లతో పాటు స్పెషల్ వంటకాలను సిద్ధం చేయించారు. వివిధ ప్రాంతాలలో ప్రసిద్ది చెందిన వంటకాలను వండడానికి నిపుణులను రప్పించి మరీ ఏర్పాట్లు చేశారు. అతిథులకు తెలంగాణ వంటకాలను రుచి చూపించడంతో పాటు హైదరాబాద్ దమ్ బిర్యానీని ప్రత్యేకంగా వడ్డించనున్నారు. దీంతో పాటు తెలంగాణ స్పెషల్స్ సర్వపిండి, జొన్న సంగటి, సకినాలు, గారెలు, మటన్ కర్రీ, చింత చిగురు మటన్ లతో పాటు మొత్తం 78 రకాల వంటకాలను సిద్ధం చేయించినట్లు కాంగ్రెస్ రాష్ట్ర నేతలు తెలిపారు.