మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ , ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీతో ప్రేమలో ఉన్నామంటూ ఇటీవల చెప్పి అందరికీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలను కూడా షేర్ చేశారు. అయితే… తాజాగా తెలిసిన విషయం ఏమిటంటే… వీరి లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ పడిపోయిందట.
సుస్మిత తో చాలా సన్నిహితంగా ఉన్న ఫొటోలను లలిత్ ఈ ఏడాది జులైలో సోషల్ మీడియాలో పంచుకున్నారు. సుస్మితతో డేటింగ్ చేస్తున్నానని, త్వరలోనే వివాహ బంధంలోకి కూడా వస్తామని లలిత్ మోదీ ట్వీట్ చేశారు.
అయితే, వయసులో చాలా తేడా ఉన్న ఈ ఇద్దరూ ప్రేమలో పడటంపై అప్పట్లో అంతా ఆశ్చర్యపోయారు. అయితే, ఈ ఇద్దరి ప్రేమ మూన్నాళ్ల ముచ్చటే అయిందట. ఈ ఇద్దరూ విడిపోయారన్న పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇటీవల, లలిత్ మోదీ తన ఇన్ స్టాగ్రామ్ లో డిస్ ప్లే పిక్చర్, బయోలో సుస్మిత ఫొటో, ఆమె ప్రస్తావనను తీసేయడంతో వీళ్లు బ్రేకప్ అయ్యారన్న పుకార్లకు బలం చేకూరుతోంది.
జులై 14న లలిత్ మోదీ.. సుస్మితా సేన్‌తో సన్నిహితంగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సుస్మిత మాత్రం ఈ బంధం గురించి ఎలాంటి వివరాలను బహిర్గతం చేయలేదు. కానీ, సుస్మితతో తన సంబంధాన్ని బహిరంగ పరిచిన వెంటనే మోదీ తన ఇన్స్టాగ్రామ్ డిస్ప్లే చిత్రంగా ఆమెతో ఉన్న ఫొటోను పెట్టారు. అలాగే, తన ఇన్స్టాగ్రామ్ బయోని కూడా మార్చారు. దానిలో, ‘ఫౌండర్ @iplt20 ఇండియన్ ప్రీమియర్ లీగ్. చివరకు నా తోడుదొంగ, ప్రేయసి సుస్మితా సేన్ తో కొత్త జీవితాన్ని ప్రారంభించాను’ అని రాశారు.
అయితే, సోమవారం లలిత్ మోదీ తన ఇన్స్టాగ్రామ్ డీపీని, బయోని మరోసారి మార్చారు. అందులో సుస్మిత ప్రస్తావన లేదు. ఆయన కొత్త బయోలో ‘ఫౌండర్ @iplt20 ఇండియన్ ప్రీమియర్ లీగ్. మూన్’ అని మాత్రమే ఉంది. ఇన్ స్టాగ్రామ్ డీపీలో కూడా తన సోలో పిక్చర్ మాత్రమే పెట్టాడు. సుస్మితతో విడిపోవడం వల్లే తన డీపీ, బయోల నుంచి ఆమె ఫొటో, పేరు తొలగించాడన్న వార్తలు వస్తున్నాయి