తెలుగు సినీ ప్రేక్షకులకు నటి సమీరా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సీరియల్స్ లో నటించింది. సమీరా (Sameera) మొదట ఆడపిల్ల అనే సీరియల్తో పరిచయం అయింది. ఆ తర్వాత జీవితం, అభిషేకం, అన్నా చెల్లెల్లు, భార్యామణి, డా. చక్రవర్తి, ముద్దు బిడ్డ, మూడు మూళ్ళ బంధం, ప్రతిబింబం, భార్యామణి (Bharya Mani), మంగమ్మ గారి మనవరాలు లాంటి సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను అలరించింది. తెలుగులోనే కాకుండా తమిళ సీరియల్స్ లో కూడా నటించింది. కానీ అన్వర్ జాన్ (Anwar John) అనే వ్యక్తిని పెళ్లి (wedding) చేసుకుని ప్రస్తుతం నటనకు దూరంగా ఉంది. ఇటీవల సమీరా ఓ బాబుకు జన్మనిచ్చింది.
యూట్యూబ్ ఛానల్ పెట్టి అందులో అన్ని విషయాలను పంచుకుటుంది.అయితే సోషల్ మీడియా(Social media)లో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈమె ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ అందరిని అలరిస్తూ ఉంటుంది. తన ప్రతి విషయాన్ని అలాగే తన కొడుకుకు సంబంధించిన విషయాలను యూట్యూబ్(Youtube)లో షేర్ చేస్తూ ఉంటుంది .ఇదిలా ఉండగా తాజాగా సమీరా చేసిన పోస్ట్ ఒకటి పలు అనుమానాలకు దారితీస్తోంది. అందులో ఆమె తన పెదవికి రక్తం కారుతూ ఉండగా ఆ ఫోటోని షేర్ చేయడంతో భర్తతో గొడవ పడిందా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎవరిని బాధ పెట్టకూడదని సమీరా ఇన్స్టా (Insta) కామెంట్ చేసింది. ప్రతి ఒక్కరి కథకి అవగాహన ఉంటుంది .
కేవలం జ్ఞాపకశక్తి (memory) కోసం క్లిక్ చేసిన చిత్రం నా ఫీడ్ లో చేరుతుందని ఎప్పుడూ అనుకోలేదు. నేను దీని గురించి మీ ఆలోచనలను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఇది చూస్తే నేను నా భర్తతో ఎక్కువ గొడవ పడినట్లు కనిపిస్తోంది. భర్తకు, భార్యకు కచ్చితంగా ఏదో ఒక గొడవ జరుగుతుంది. నా భర్తతో చాలా మంచి సమయాన్ని గడిపాను. నేను నా భర్త పెద్దగా గొడవ పడినట్టు ఆ పిక్ (Pic) లో కనిపిస్తోంది. కానీ ఇది అర్హాన్ పొరపాటు వల్ల జరిగింది .కానీ మీరు ఈ ఫోటో చూడగానే కచ్చితంగా నా భర్తతో గొడవ వల్లే జరిగి ఉంటుందని అనిపించి ఉండవచ్చు. మేము గొడవపడతాం కానీ ఒకరికొకరు ప్రేమిస్తామంటూ రాసుకొచ్చింది సమీరా.