ఈ నెల 18 నుంచి జరిగే పార్లమెంటు (Parliament) ప్రత్యేక సమావేశాలను సెప్టెంబర్ 19 నుంచి కొత్త భవనంలోకి మార్చనున్నారు. అయితే నూతన పార్లమెంటు.. భవనంలోకి వెళ్లే సమయంలో సిబ్బంది కొత్త యూనిఫాం ధరించి వెళ్లనున్నట్లు సమాచారం. ఇది నెహ్రూ జాకెట్ల (Nehru jackets) మాదిరిగా ఊదా ఎరుపు రంగు లేదా గులాబీ రంగు, వారి చొక్కాలు పువ్వుల డిజైన్ ముదురు గులాబీ రంగులో ఉంటాయి. ఉద్యోగులు ధరించే ప్యాంట్లు ఖాకీ రంగులో ఉండనున్నట్లు తెలుస్తోంది.సెప్టెంబర్ 18న సమావేశాలు ప్రారంభం కాగా, గణేష్ చతుర్థి (Ganesh Chaturthi) సందర్భంగా సెప్టెంబరు 19న పూజ నిర్వహించిన అనంతరం కొత్త పార్లమెంట్ భవనంలోకి లాంఛనంగా ప్రవేశం ఉంటుంది.
యూనిఫాంను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT) డిపార్ట్ మెంట్ వారు రూపొందించారు.పార్లమెంట్ సిబ్బంది డ్రెస్ బ్యూరోక్రాట్(Bureaucrat)లా బంద్‌గాలా సూట్, మెజెంటా, ముదురు గులాబీ రంగు నెహ్రూ జాకెట్‌ను రూపొందించారు. వారి చొక్కాలు కూడా లోటస్ ఫ్లవర్ డిజైన్‌తో లేత గులాబీ రంగును కలిగి ఉన్నాయి. అదేవిధంగా లోక్ సభ, రాజ్యసభల్లో మార్షల్స్(Marshalls) దుస్తులను కూడా మార్చారు. ఇక నుంచి వారు మణిపురి తలపాగాలను ధరించనున్నారు. పార్లమెంట్ భవనంలో భద్రతా సిబ్బంది దుస్తులను కూడా మార్చనున్నారు.సఫారీ సూట్(Safari suite)లకు బదులుగా వారికి మిలటరీ తరహాలో ఉండే దుస్తులను కేటాయించనున్నారు.
సెప్టెంబర్ 18 నుంచి 22 వరకూ ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చింది కేంద్ర ప్రభుత్వం. పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు ఒకే దేశం, ఒకే ఎన్నిక (One Nation,One Election)పైనా చర్చ జరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే దీనిపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్(Ram Nath Kovind) నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటైంది. అయితే…ఈ ప్రత్యేక సమావేశాలు పాత పార్లమెంట్ బిల్డింగ్‌లో జరుగుతాయా..? లేదంటో కొత్త భవనంలో నిర్వహిస్తారా అన్న అనుమానాలు తలెత్తాయి.