»Telangana Assembly Elections May Be Conducted Next Year
Assembly ఎన్నికలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు.. వచ్చే ఏడాది అంటూ..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ 10వ తేదీ లోపు షెడ్యూల్ రావాలని.. లేదంటే ఏప్రిల్, మే నెలలోనే ఎన్నికలు జరుగుతాయని మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Telangana Assembly Elections May be Conducted Next Year
Telangana Assembly Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections) సమయం దగ్గర పడుతోంది. డిసెంబర్ లేదంటే జనవరిలో ఎన్నికల జరగాలి. కానీ ఎన్నికల గురించి చడీ చప్పుడు లేదు. పార్లమెంట్ సమావేశాల జరుగుతుండటం, జమిలి ఎన్నికల గురించి తెరపైకి రావడంతో.. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై గందరగోళం నెలకొంది. తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) ఎన్నికల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 10వ తేదీ లోపు ఎన్నికల షెడ్యూల్ రావాల్సి ఉందని చెప్పారు. లేదంటే ఈ ఏడాది ఎన్నికలు జరిగే అవకాశం లేదన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్, లేదంటే మే నెలలో ఎన్నిక జరగాల్సి ఉందని చెప్పారు.
జమిలీ ఎన్నికలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటోంది. నవంబర్- డిసంబర్ నెలలో 5 రాష్ట్రాల ఎన్నికలు.. ఏప్రిల్, మే నెలలో 7 రాష్ట్రాల అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. మధ్యేమార్గంగా ఫిబ్రవరిలో 12 రాష్ట్రాలు, లోక్ సభ ఎన్నిక నిర్వహించాలనే ప్రణాళిక కూడా రచించిందని వార్తలు గుప్పుమన్నాయి. లేదంటే.. ఏప్రిల్, మే నెలలో అన్నీ రాష్ట్రాలు, లోక్ సభ ఎన్నిక నిర్వహించాలనే కృతనిశ్చయంతో బీజేపీ ఉంది. మిగతా రాష్ట్రాల సీఎంలు ఇందుకు సమ్మతించాల్సి ఉంటుంది. ఏడు రాష్ట్రాల సీఎంలు అందుకు ఒప్పుకునే అవకాశం లేదు. దాంతో ఏం చేయాలని బీజేపీ హై కమాండ్ ఆలోచిస్తోంది.
జమిలీ వీలుకాకుంటే.. కనీసం మినీ జమిలీ ఎన్నిక నిర్వహించాలని అనుకుంటోంది. కేంద్రం.. రాష్ట్రాల్లో కూడా బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దేశాన్ని హిందు రాజ్యం చేయడమే బీజేపీ పెద్దల లక్ష్యం. అందుకు అనుగుణంగా ప్రణాళిక రచించుకుంటూ ముందుకు వెళ్తుంది. భారతీయ జనతా పార్టీకి దక్షిణాది రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో ఓటు బ్యాంక్ లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసే సీన్ అంతకన్నా లేదు. కర్ణాటక తప్ప మిగతా రాష్ట్రాల్లో ఆ పార్టీ ప్రభావం చాలా తక్కువ. ఆయా చోట్ల కూడా బలపడాలని.. అధికారం చేపట్టాలని బీజేపీ వ్యుహారచన చేస్తోంది. అది ప్రాక్టికల్‌గా వర్కవుట్ కావడం లేదని విశ్లేషకులు అంటున్నారు.