టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ (Mahendra Singh) ధోనీకి అరుదైన అవకాశం లభించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో కలసి, ధోనీ గోల్ఫ్ ఆట ఆడినారు.‘‘అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఎంఎస్ ధోనీ కోసం గోల్ఫ్ గేమ్‌ను ఏర్పాటు చేశారు. ధోనీ తనదైన పొడవాటి జట్టుతో కనిపించగా, డోనాల్డ్ ట్రంప్ తలకు రెడ్ కలర్ క్యాప్ పెట్టుకుని ఉన్నారు. ఒకరు క్రికెట్ సెలబ్రిటీ అయితే, మరొకరు అమెరికా(America)లో ప్రముఖ రాజకీయ నేత కావడం ఆసక్తికి దారితీసింది. అమెరికాలోనూ తలా ఫీవరే’’ అంటూ ఓ యూజర్ ట్విట్టర్ పై (ఎక్స్) పోస్ట్ చేశారు. ధోనీ గ్రే కలర్ పాయింట్ పై బ్లూ షీటర్ట్ ధరించి ఉన్నారు.
యూఎస్ ఓపెన్ (US Open) 2023 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కు హాజరైన ధోనీ, ఆ మరుసటి రోజు గోల్ఫ్ గేమ్ లో పాల్గొన్నారు. మొత్తం మీద ధోనీ అభిమానులకు ఈ గోల్ఫ్ గేమ్ (Golf game) మంచి కిక్కే ఇస్తోంది. వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలకు ముందు భారత సంతతి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకే ట్రంప్ ధోనీతో ఈ పోటీకి తెరతీశారా? అన్న సందేహం కొందరికి ఎదురవుతోంది. ధోనీని ఆప్యాయంగా పలకరించిన ట్రంప్..వీరువురు కాసేపు మాట్లాడారు. క్రికెట్ (Cricket) సంగతులు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కాసేపు సరదాగా గోల్ఫ్ ఆడారు.ట్రంప్‌తో ధోనీ ఉన్న ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా(Social media)లో చక్కర్లు కొడుతోంది. ఇందులో ధోనీ గోల్ఫ్ స్టిక్‌తో కనిపిస్తున్నాడు. పక్కనేడోనాల్డ్ ట్రంప్ (Donald Trump) నవ్వుతూ థంబ్సప్ సింబల్ ఇచ్చారు. ఈ ఫొటో వైరల్ అయ్యింది.