తన భర్తది ఆత్మహత్య కాదు, హత్య అని హోంగార్డు రవిందర్(home guard Ravinder) భార్య సంధ్య(Sandhya) ఆరోపిస్తున్నారు. అధికారుల వేధింపుల వల్లనే తన భర్త అలా చేసుకున్నాడని తెలిపారు. రవిందర్ ను కానిస్టేబుల్ చందు, ఏఎస్ఐ నరసింగ రావులే చంపేశారని ఆమె అన్నారు. హోం గార్డు ఆఫీసర్ హైమత్, బాబురావు పాత్ర కూడా ఈ కుట్రలో ఉందన్నారు. హోంగార్డు ఆఫీసుకు తన భర్త వచ్చినప్పుడు తనకు ఫోన్ చేశాడని ఆమె తెలిపింది. అప్పుడు చందు, నరసింగ రావులు ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని తనకు చెప్పాడని ఆమె స్పష్టం చేసింది. తన భర్త సూసైడ్ చేసుకోలేదని ఆమె(wife) అన్నారు. ప్లాన్ ప్రకారం చంపేశారని ఆమె ఆరోపించారు. తమకు అన్నీ విధలా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తన భర్త మృతికి కారణమైన వారిని అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దీంతోపాటు తన భర్త ఫోన్ అన్ లాక్ చేసి అందులో ఉన్న రికార్డులు అన్ని డిలీట్ చేశారని హోం గార్డు రవిందర్ భార్య తెలిపారు.
మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని హోం గార్డులు అందరూ డ్యూటీల్లో తప్పనిసరిగా చేరాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరూ ఆయా పోలీస్ స్టేషన్లలో ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. హాజరు కానీ వారి ఉద్యోగం పోయే అవకాశం ఉందని కూడా ఆదేశిలిచ్చారు. హోంగార్డు రవిందర్ సూసైడ్ మృతి నేపథ్యంలో అతనికి మద్దతుగా నిరసనలో పాల్గొన్న హోం గార్డులు విధుల్లో చేరాలని ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షనేతలు ప్రశ్నిస్తున్నారు. నిరసన తెలిపే హక్కు కూడా వారికి లేదా అని అంటున్నారు.