అవతార్ సినిమా సినీ చరిత్రలోనే ఓ అద్భుతమని చెప్పాలి. దశాబ్ద కాలం కిందట దర్శకుడు జేమ్స్ కామెరూన్ అవతార్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆ సినిమాను చూసి అందరూ ప్రశంసలు కురిపించారు. ‘పాండోర’ ప్రపంచాన్ని తెరపై చూపించి డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. విజువల్ వండర్ గా ఆ సినిమా ఎంతో పేరు తెచ్చుకుంది. అద్భుతమైన విజయాన్ని, కలెక్షన్లను ఆ సినిమా సాధించింది. ఆ సినిమాకు సీక్వెల్ గా ఈ మధ్యనే అవతార్-2ను జేమ్స్ కామెరూన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈసారి అవతార్ ద వే ఆఫ్ వాటర్ అంటూ మరో ప్రపంచాన్ని చూపించారు. సముద్ర గర్భ అందాలను చూపిస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ఈ సీక్వెల్స్ లో మరో 5 సినిమాలు వస్తాయంటూ జేమ్స్ ప్రకటించాడు. తాజాగా అవతార్ మూడో భాగం గురించి ఓ విషయాన్ని జేమ్స్ తెలిపారు. క్రిటిక్ ఛాయస్ అవార్డ్స్ లో బెస్ట్ విజువల్ ఎఫెక్ట్ కేటగిరిలో అవతార్-2 సినిమా అవార్డు అందుకున్న నేపథ్యంలో అవతార్ -3 గురించి జేమ్స్ తెలిపారు. మూడో భాగం మొత్తం అగ్ని నేపథ్యంలో సాగుతుందని తెలిపారు. మరో కొత్త ప్రాంతంలో కొత్త తెగలను పరిచయం చేయనున్నట్లు వెల్లడించారు. అవతార్3 సినిమాను 2024 డిసెంబర్ లో విడుదల చేయనున్నట్లు జేమ్స్ కామెరూన్ తెలిపారు.