»Heavy Rain In Telangana Imd Said Red Alert For Hyderabad September 5th 2023
Heavy rain: దంచి కోడుతున్న వర్షం..హైదరాబాద్ కు రెడ్ అలర్ట్
రాష్ట్రంలోని హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి పెద్ద ఎత్తున వర్షం కురుస్తోంది. దీంతో భాగ్యనగరంలోని రోడ్లపై భారీగా నీరు నిలిచి ప్రయాణానికి ఆటంకంగా మారింది. ఇప్పటికే అధికారులు హైదారాబాద్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
Heavy rain in telangana imd said Red alert for Hyderabad september 5th 2023
తెలంగాణలో మంగళవారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్(hyderabad) నగరంతోపాటు అనేక చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే భారత వాతావరణ శాఖ రాష్ట్రంలోని హైదరాబాద్లో రెడ్ అలర్ట్, 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 18 జిల్లాలకు ఎల్లో ఎలర్ట్ అలర్ట్ ప్రకటించారు. ఈ జోరు వాన మరో 3 గంటలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. జోరుగా కురుస్తున్న వర్షంతో హైదరాబాద్లోని అనేక రోడ్లు(roads) నీటితో నిండిపోయాయి. పలు చోట్ల డ్రైనీజీ మ్యాన్ హోల్స్ నిండిపోయి ప్రవాహిస్తున్నాయి. దీంతో రోడ్లపై నీరు ఎక్కడకక్కడ నిలిచిపోయింది.
నీరు నిలిచి..
ఈ క్రమంలో యూసఫ్ గూడ, శ్రీనగర్ కాలనీ, మోతీ నగర్, అమీర్ పేట్, కూకట్ పల్లి, ఖైరతాబాద్, సికింద్రాబాద్, మలక్ పేట, చార్ మినార్, ఎల్బీనగరర్, తిరుమల గిరి, అల్వాల్, ఉప్పల్ వంటి అనేక ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో వాహనదారులు రోడ్లపై ప్రయాణించాలంటే ఇబ్బందిగా మారింది. పెద్ద ఎత్తున రోడ్లపై నీరు నిలిచి ప్రయాణానికి ఆటంకంగా మారింది.
హైకోర్టు ఆదేశం
IMD ప్రకారం ఈశాన్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని నారాయణపేట, గద్వాల్ వనపర్తి, నాగర్కర్నూల్ మినహా దాదాపు అన్ని జిల్లాల్లో ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు జారీ చేశారు. భారీ వర్షాల సమయంలో ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడేందుకు దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్రాన్ని ఆదేశించింది. వరదల సమయంలో తప్పిపోయిన బాధితురాలు గడ్డం మహాలక్ష్మి ఇప్పటికీ ఆచూకీ తెలియడం లేదని కార్యకర్త చెరుకు సుధాకర్ పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన ధర్మాసనం విచారించింది. మూసీ నది నాలాలో 55 ఏళ్ల మహిళ పడిపోయినట్లు ఆదివారం అధికారులకు సమాచారం వచ్చింది. కానీ ఆమె ఆచూకీ ఇంకా లభించలేదు.
ఏపీలో కూడా!
దీంతోపాటు ఏపీకి కూడా బారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. మరో నాలుగు రోజులు ఏపీలో వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మత్య్సకారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.