MDK: శివంపేట మం. దంతాన్పల్లిలో సర్పంచ్ మమత ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో వృద్ధులు, మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. నిపుణులైన వైద్యులు ఉచితంగా సలహాలు అందించి, అవసరమైన వారికిపై వైద్యం కోసం రిఫరల్ సేవలు సూచించారు.