»Explosion In Fireworks Factory Seven People Killed At West Bengal Duttapukur
Explosion: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..8 మంది మృతి
ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో ఆగస్మాత్తుగా జరిగిన పేలుడులో 8 మంది మరణించారు. ఈ విషాద ఘటన పశ్చిమ బెంగాల్లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని దత్తాపుకూరులో చోటుచేసుకుంది.
Explosion in fireworks factory seven people killed at West Bengal Duttapukur
పశ్చిమ బెంగాల్లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని దుత్తపుకూరులో ప్రమాదవశాత్తు బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది మృత్యువాత చెందారు. ఈ క్రమంలో విషయం తెలసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స కోసం బరాసత్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ అక్రమంగా పటాకులు తయారు చేస్తుండగా ఇది జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పేలుడు కారణంగా పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి.
#WATCH | West Bengal: Several people feared dead in an explosion at the Illegal crackers factory in Duttapukur. A rescue operation is underway. The injured are being taken to Barasat Hospital for treatment: Duttapukur Police sources pic.twitter.com/YzKW7cU8gM
పేలుడు చాలా శక్తివంతంగా జరిగిందని ఆ ప్రాంతంలోని అనేక భవనాలు దెబ్బతిన్నాయని అగ్నిమాపక దళ అధికారులు తెలిపారు. దత్తపుకర్లోని నీల్గంజ్ ప్రాంతంలో ఉదయం 10.40 గంటల ప్రాంతంలో రెండంతస్తుల ఇంటిలో ఈ పేలుడు సంభవించిందని స్థానికులు పేర్కొన్నారు. ఫ్యాక్టరీని ఓ ఇంటిలో అక్రమంగా నడుపుతున్నారని స్థానికులు చెబుతున్నారు. పేలుడు సంభవించిన భవనంలో బాణసంచా నిల్వలు ఉన్నాయి. ఇది క్రాకర్స్ తయారు చేసే ప్రాంతం కాదని.. ఇక్కడికి దూరంగా ఉన్న నీల్గంజ్లోని నారాయణపూర్ ప్రాంతం ప్రధాన తయారీ కేంద్రమని మరోక అధికారి చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.