»Ap Rains August 27th And 28th 2023 Weather Report
AP Rains: నేడు, రేపు వర్షాలు..అధికారుల సూచన
ఏపీలో(AP rains) ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు.
చాలా రోజుల తర్వాత మళ్లీ నైరుతి రుతుపవనాలలో కొంత కదలిక వచ్చింది. ఈ నేపథ్యంలో నేడు, రేపు ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు(andhra pradesh rains) కురియనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్రా, రాయలసీమలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అన్నారు. చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. దీంతోపాటు నైరుతి, పశ్చిమ ప్రాంతాలకు గాలులు కూడా వీస్తాయని ప్రకటించారు.
అయితే ఇప్పటికే శనివారం వివిధ జిల్లాల్లోని పలు చోట్ల వర్షపాతం నమోదైంది. చిత్తూరు జిల్లా రామాపురంలో 3.1 సెం.మీ, తిరుపతి జిల్లా అరణ్యకండ్రిగ, నంద్యాల జిల్లా చిలకలూరు, అనంతపురం జిల్లా చిటికలపల్లె, సత్యసాయి జిల్లా గోరంట్లో, ఏలూరు జిల్లా బుట్టాయగూడెంలో వరుసగా 2.7 సెం.మీ, 2.4 సెం.మీ, బుట్టాయగూడెంలో 2.3 సెం.మీ వర్షం కురిసింది. ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావంతో ఆదివారం, సోమవారం ఆయా ప్రాంతాల్లోని ప్రజలు(people) అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.