»Rahul Sipliganj Contest As Mla This Is The Clarity
Rahul Sipliganj: ఎమ్మెల్యేగా రాహుల్ సిప్లిగంజ్ పోటీ.. ఇదే క్లారిటీ!
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడో బస్తీ నుంచి మొదలైన రాహుల్ కెరీర్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ రేంజ్‌కి వెళ్లిపోయింది. అందుకే ఇప్పుడు రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాడనే పుకార్లు వస్తున్నాయి. తాజాగా దీని పై రాహుల్ క్లారిటీ ఇచ్చేశాడు.
గతంలో ఎన్నో పాటలు పాడినప్పటికీ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipliganj)కు పెద్దగా గుర్తింపు దక్కలేదు. కానీ బిగ్‌బాస్ విన్నర్ అయ్యాక రాహుల్‌కు కాలం బాగా కలిసొచ్చింది. మార్చి 12న 95వ అకాడమీ అవార్డ్స్ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ ప్రతిష్టాత్మక్ ఈవెంట్లో నాటు నాటు సాంగ్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశారు సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ. నాటు నాటు సాంగ్ ఒరిజినల్ వెర్షన్, తెలుగులో పాట పాడడంతో.. కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆస్కార్ వేదిక పై లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అదే వేదిక పై ఆస్కార్ అందుకొని చరిత్ర సృష్టించారు.
అప్పటి నుంచి రాహుల్ గురించి ఎలాంటి న్యూస్ వచ్చిన వైరల్ అవుతోంది. ఈ క్రమంలో ఈ మధ్య రాహుల్ ఎమ్మేల్యేగా పోటీ చేయబోతున్నాడనే న్యూస్ వైరల్ అవుతోంది. కాంగ్రెస్ పార్టీ రాహుల్‌ను గోషామహల్ నియోజవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. కానీ రాహుల్ అక్కడి నుంచి కాకుండా.. వేరొక నియోజకవర్గాన్ని పరిశీలించాలని కాంగ్రెస్ నేతలను కోరినట్టు కూడా వినిపించింది. దీంతో ఇలాంటి వార్తాల పై స్పందించాడు రాహుల్.
‘తాను రాజకీయాల్లోకి వెళ్లడం లేదని.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. తనపై వస్తున్నదంత ఫేక్ న్యూస్.. ప్రస్తుతానికి తన దృష్టి మొత్తం మ్యూజిక్ అండ్ తన కెరీర్ పైనే ఉంది. తనను రాజకీయ నాయకులు ఎవ్వరు సంప్రదించలేదు.. అని క్లారిటీ ఇచ్చాడు. దీంతో ఈ యంగ్ సింగర్ ఇప్పుడే పొలిటికల్‌గా వద్దని అనుకుంటున్నాడని చెప్పొచ్చు. ప్రస్తుతం రాహుల్ కెరీర్ పీక్స్‌లో ఉంది. ఇలాంటి సమయంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా.. విమర్శలు తప్పవు. అందుకే రాహుల్‌కు అలాంటి ఆలోచన ఇప్పట్లో లేదని చెప్పాలి.