Madurai Train Fire Accident: మరో రైలు ప్రమాదం..9 మంది మృతి
మధురై(Madurai) రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న రైలులో ఒక్కసారిగా మంటలు(Fire Accident ) చెలరేగాయి. లక్నో-రామేశ్వరం టూరిస్ట్ రైలులో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా..పలువురు గాయపడ్డారు.
janasena party alliance with bjp in telangana assembly elections 2023
ఉత్తరప్రదేశ్‌లోని లక్కీపూర్‌కు చెందిన లక్నో-రామేశ్వరం టూరిస్ట్ రైలులో మధురై(Madurai ) సమీపంలో మంటలు(Fire Accident) చెలరేగాయి. ఈ ప్రమాదంలో రైలు(trian)లో ప్రయాణిస్తున్న 9 మంది మృతి చెందినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదంలో 20 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్న ఈ రైలు రెండు కోచ్‌లలో ఒక్కసారిగా మంటలు ఆకస్మాత్తుగా వ్యాపించినట్లు అధికారులు చెబుతున్నారు. మదురై స్టేషన్లో రైలు ఆగి ఉండగా మంటలు చెలరేగినట్లు సమాచారం. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై రైల్వే పోలీసులు(police) ఆరా తీస్తున్నారు.
#WATCH | Tamil Nadu: Fire reported in private/individual coach at Madurai yard at 5:15 am today in Punalur-Madurai Express. Fire services have arrived and put off the fire and no damage has caused to another coaches. The passengers have allegedly smuggled gas cylinder that caused… pic.twitter.com/5H7wQeGu93
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. రైలు(train) చివరి రెండు కోచ్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి. 15 రోజుల ఆధ్యాత్మిక యాత్ర కోసం లక్నో నుంచి వచ్చిన రైలు మదురైలో ఆగడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఆరుగురు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారని తెలిసింది. మరోవైపు రైలులోని పర్యాటకులు తెల్లవారుజామున సిలిండర్‌తో వంట చేస్తుండగా సిలిండర్ లీక్ అయి పేలి మంటలు చెలరేగిందని పలువురు అంటున్నారు. బాధిత కోచ్‌లో 55 మంది ప్రయాణికులు ఉన్నారు.