WGL: గ్రేటర్ వరంగల్ 19వ డివిజన్ ఓసీటీలో గల శ్రీ సీతారామాంజనేయ, హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవస్థాన కమిటీ ధర్మకర్తగా మోతిలాల్ నాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తనను ధర్మకర్తగా నియమించినందుకు భాస్కర్ ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రతిఒక్కరు సహకరించాలని కోరారు.