National Awards: జాతీయ అవార్డులు ఎలక్షన్ స్టంటేనా..అల్లు అర్జున్ ప్రచారం?
భారతీయ చలనచిత్ర రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ అవార్డులను కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఎన్నికలు సమీపిస్తున్నవేళ వీటి ప్రధానోత్సవం చూస్తుంటే ఇది కచ్చితంగా బీజేపీ గేమ్‌లో భాగంగా ఎన్నికల స్టంటేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అది నిజమేనా అనేది ఇప్పుడు చుద్దాం.
National Awards: ఇండియన్ ఫిల్మ్(Film) విభాగంలో నేషనల్ అవార్డుల(National Film Awards)కు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి సంవత్సరం ప్రకటించే ఈ అవార్డులను కేంద్రం తాజాగా ప్రకటించింది. వీటి వెనుక ఏదైన రాజకీయం(Poliyics) కోణం ఉందా అనే దానిపై విశ్లేషకులు ఆరా తీస్తున్నారు. రానున్న ఆరు నెలల్లో దేశంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగనుంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ దఫా ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. అందుకే కేంద్రం ఈ అవార్డులను ప్రచారంలో వాడుకోనుందా అనేది అందరిలో తలెత్తుతున్న ప్రశ్న.
ఈ కోణంలో పరిశీలిస్తే కర్ణాటక(Karnataka) రాష్ట్రంలో ఎన్నికలు ముగిసాయి. కాబట్టి ఆ పరిశ్రమ నుంచి వచ్చిన సినిమాలకు తగినంత ఆధారణ లభించలేదు అనేది ఆ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నట్లు తెలుస్తుంది. కచ్చితంగా రీజనల్ ఫిల్మ్ విభాగంలో ఒక చిత్రానికి అవార్డు ఇవ్వాలి. కాబట్టి చార్లీస్ 777(Charlies 777) అనే సినిమాకు ఒక అవార్డు తప్ప, ఆస్కార్‌కు పోటీపడ్డా కాంతార(Kanthara) సినిమాకు కానీ, దేశం మొత్తం కన్నడ చిత్రసీమ వైపు చూసేలా చేసిన కేజీఎఫ్(KGF) చిత్రానికి కానీ అవార్డులు రాకపోవడమే పలు అనుమానాలకు తావిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే కర్ణాటకలో ఎన్నికలు ముగిసి కాంగ్రెస్ నేత సిద్దరామయ్య సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
భారతీయ సినిమాలకు ఒక స్టాండర్డ్‌ను సెట్ చేసిన సత్యజిత్ రే అంటే బెంగాలి(West Bengal) సినిమాలు గుర్తుకు వస్తాయి. అలాంటిది రీ రికార్డింగ్‌లో తప్ప వేరే ఏ విభాగంలో కూడా అవార్డులను దక్కించుకోలేదు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ చాలా స్ట్రాంగ్ లీడర్ అలాగే రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం దాదాపు కష్టమే. అందుకే ఈ అవార్డుల పరంపరలో ఆ రాష్ట్రానికి సంబంధించిన సినిమాకు తగిన ప్రాధాన్యత లభించలేదని మరో వాదన తెరపై ఉంది. ఆ విధంగానే బాలీవుడ్(Bollywood) విషయంలో కూడా కేంద్రం కాస్తా పక్షపాతం చూపించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక ఎటొచ్చి మన తెలుగు రాష్ట్రాల గురించి.. ఇప్పుడు దేశమంతా చర్చ సాగుతోంది. దాదాపు 10 అవార్డులు మన తెలుగు సినిమాలకే దక్కడం ప్రాంతీయవాదులుగా మనకు గర్వకారణం. అయినా ఈ కార్యక్రమంతో రెండు రాష్ట్రాల్లో జాతీయ పార్టీ అయిన బీజేపీ జెండా పాతాలని చూస్తోంది. గతంలో కేంద్ర హోం మినిస్టర్ అమిత్‌షా(Amith Shah) హైదరాబాద్‌కు వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్(NTR)ను కలవడం, అలాగే ఢిల్లీకి కూడా పిలుపించుకుని చర్చించారు. ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమా ఏకంగా 6 అవార్డులు దక్కించుకోవడం కూడా రాజకీయకోణంలోనే చూస్తున్నారు. అదే విధంగా త్రిబుల్ ఆర్ సినిమాకు రచయితగా పనిచేసిన విజేంద్రప్రసాద్ బీజేపీ రాజ్యసభ సభ్యులుగా ఉండడం కూడా అందరి అనుమానాలు నిజమనే భావనను కలిగిస్తోంది.
ఇక పుష్ప ది రైజ్ సినిమాకు గాను అల్లు అర్జున్(Allu Arjun) జాతీయ ఉత్తమ నటుడి అవార్డును దక్కించుకోవడం తెలుగు పరిశ్రమకే గర్వకారణం. అయితే అల్లు అర్జున్ను ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి ఏమైనా ఉపయోగించుకుంటారా అనేది అందరిలో ఉన్న అనుమానం. లేదా తెలంగాణ ఎన్నికల్లో వాడుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఎలక్షన్లు కూడా ఎన్నోరోజులు లేవు. కాబట్టి మునుముందు ఏం జరగబోతుందో, బీజేపీ ఎన్నికల స్ట్రాటజీలో భాగంగా ఈ అవార్డులను ఎంతవరకు ఉపయోగించుకుంటారో తెలుస్తుంది. ఇవన్ని ఎలా ఉన్నా తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో తగిన గౌవరం దక్కిందని టాలీవుడ్ ప్రేక్షకులు సంబరాలు చేసుకుంటున్నారు.