Allu Arjun: పుష్ప మూవీతో అల్లు అర్జున్‌కు (Allu Arjun) నేషనల్ అవార్డు వచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధి లేకుండా పోయింది. ఇక బన్నీ తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సంతోషం వ్యక్తం చేశారు. 69 ఏళ్లుగా తెలుగు పరిశ్రమకు రానీ.. అద్భుతాన్ని తీసుకొచ్చారని తెలిపారు. నిర్మాత, దర్శకుడు, చిత్ర బృందానికి కృతజ్ఞతలు చెప్పారు. తమ కుటుంబాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లిన అల్లు అర్జున్‌కు (Allu Arjun) థాంక్స్ అన్నారు.
అర్జున్‌కు (Allu Arjun) అవార్డు వచ్చిందనే తెలియగానే పుష్ప మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, దర్శకుడు సుకుమార్ బన్నీ ఇంటికి వచ్చారు. సుకుమార్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. బన్నీని గట్టిగా హత్తుకున్నాడు. అందరూ వారిద్దరినీ అభినందించారు.
Heartiest Congratulations to All The Award Winners of 69 th National Film Awards 2021 !!!! 👏👏👏
Also Proud Moment for Telugu Cinema 👏👏👏
Heartiest Congratulations to especially my dearest Bunny @AlluArjun for the coveted National Best Actor Award !!!!! Absolutely Proud of…
అల్లు అర్జున్ను (Allu Arjun) చూసి గర్విస్తున్నామని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. అవార్డ్స్ దక్కించుకున్న వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. బావా అని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. పుష్ప మూవీ కోసం మీరు పొందే అన్ని విజయాలు, అవార్డులకు అర్హులు అని పొగిడారు.
Congratulations @alluarjun bava. You deserve all the success and awards you get for #Pushpa.
పుష్ప తగ్గేదేలే.. అభినందనలు బన్నీ అని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ట్వీట్ చేశారు. అవార్డులు గెలుచుకున్న వారికి అభినందనలు తెలియజేశారు. నేషనల్ అవార్డ్స్‌లో ఆర్ఆర్ఆర్ సిక్సర్ కొట్టిందని తెలిపారు. గంగుభాయి కఠియావాడిలో నటనకు గానూ అలియా భట్‌కు అవార్డ్ రావడంపై హర్షం వ్యక్తం చేశారు.