Star heroine జూ.ఎన్టీఆర్‌ను ఏడుసార్లు రిజెక్ట్ చేసిందా?
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గ్లోబల్ రేంజ్లో ఉంది. నెక్స్ట్ సినిమాలన్నీ బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌గా రాబోతున్నాయి. అలాంటి యంగ్ టైగర్‌ను ఓ స్టార్ హీరోయిన్ ఏకంగా ఏడుసార్లు రిజెక్ట్ చేసిందనే న్యూస్ షాక్ ఇస్తోంది. ఇంతకీ ఎవరా హాట్ బ్యూటీ?
Star heroine: నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్‌తో ఫస్ట్ టైం సాలిడ్ హిట్ అందుకున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు తారక్. ఆది, సింహాద్రి, యమదొంగ మొదలుకొని చివరగా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ రేంజ్‌కు వెళ్లిపోయాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్‌తోపాటు గ్లోబల్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు.
ప్రస్తుతం కొరటాల శివతో ‘దేవర’ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత బాలీవుడ్లో హృతిక్ రోషన్‌తో కలిసి ‘వార్ 2’ సినిమా చేయనున్నాడు. ఆ పైన హై ఓల్టేజ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ 31 సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్‌కు అతని సరసన నటించే ఛాన్స్ వస్తే హీరోయిన్లకు పండగే. గతంలో బ్యూటీ స్వీటి దేవసేన ఎన్టీఆర్‌ను ఏకంగా ఏడుసార్లు రిజెక్ట్ చేసిందట. ఎన్టీఆర్, అనుష్క కాంబోలో దాదాపు ఏడు సినిమాలు క్యాన్సిల్ అయ్యాయట.
ఆ సినిమాలు ఏంటనేది తెలియదు గానీ.. అప్పట్లో ఎన్టీఆర్ చాలా బొద్దుగా ఉండేవాడు. యమదొంగ సినిమా కోసం చాలా వరకు వెయిట్ లాస్ అయ్యాడు తారక్. అప్పటినుంచి అదే ఫిజిక్‌ను మెయింటేన్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ కాస్త లావుగా ఉండడంతో.. చాలా మంది హీరోయిన్లు రిజెక్ట్ చేశారట. అందులో ముఖ్యంగా అనుష్క కూడా ఒకరని అంటున్నారు. కాకపోతే ఏడు సినిమాలు రిజెక్ట్ అంటేనే కాస్త నమ్మశక్యంగా లేదు. అలా జరిగినా ఆశ్యర్యపోనక్కర్లేదు. ఏదేమైనా అనుష్క, ఎన్టీఆర్ కాంబో మాత్రం మిస్ అయ్యారనే చెప్పాలి