King of kotha Review: కింగ్ ఆఫ్ కొత్త మూవీ ఫుల్ రివ్యూ
దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మి హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం కింగ్ ఆఫ్ కొత్త నేడు(ఆగస్టు 24న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిలాష్ జోషి దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్లో విడుదల అయిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
King of kotha Review: మహానటి(Mahanati) సినిమాలో గణేషన్ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) ఇక్కడ మంచి మార్కెట్ సంపాదించుకున్నారు. సీతారామం హిట్‌తో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన నటించిన కింగ్ ఆఫ్ కొత్త(King of kotha) మూవీ పాన్ ఇండియా రేంజ్లో విడుదల అయింది. మరీ ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
కింగ్ ఆఫ్ కొత్త(King of kotha) చిత్రం 1980 కాలం నాటి నేపథ్యంలో సాగుతుంది. ఒక సాధారణ కుర్రాడు తన జీవితంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా అతను ఎవరు ఊహించని విధంగా ఊరినే శాసించే అండర్ వరల్డ్ డాన్‌గా ఎదుగుతాడు. స్వతహాగా మంచి ఫుట్‌బాల్ ప్లేయర్ అయిన రాజు ఎన్నో గ్యాంగులను మట్టి కరిపించి కింగ్‌లా మారుతాడు. అందుకే రాజు(దుల్కర్ సల్మాన్) అంటే కోపంతో పోలీసులు, పొలిటికల్ లీడర్లు, గ్యాంగ్స్ అన్ని అతన్ని నాశనం చేయాలని పథకాలు వేస్తారు. ఈ గ్యాంగుల నుంచి రాజు ఎలా బయటపడ్డాడు? చివరికి రాజు ప్రయాణం ఎక్కడికి చేరింది? వంటి ప్రశ్నలకు సమాధానమే కింగ్ ఆఫ్ కొత్త చిత్రం.
ఎలా ఉంది:
గ్యాంగ్ స్టర్ సినిమాలు మనకు కొత్తెం కాదు. అయితే ప్రెసెంటేషన్ అనేది చాలా ముఖ్యం. స్టోరీలో కొత్తదనం ఏమీ లేదు. ఇదే కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు వచ్చాయి. కానీ చూపించే విధానంలో కింగ్ ఆఫ్ కొత్త దీని ప్రత్యేకతను చాటుకుంది. అయితే సినిమాలో పెద్దగా ట్విస్టులు ఏమి ఉండవు. ఫస్ట్ హాఫ్ మొత్తం స్టోరీ లోని క్యారెక్టర్ ఇంట్రడక్షన్ తో సరిపోతుంది. అసలు కథ మొదలయ్యేది సెకండ్ హాఫ్ లోనే. మూవీ స్లోగా ఉన్నప్పటికీ ఎక్కడ బోర్ కొట్టదు. రాజు క్యారెక్టర్ కి దుల్కర్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. ఈ మూవీలో ఉన్న మరొక స్ట్రాంగ్ క్యారెక్టర్ నైలా ఉష పోషించిన పాత్ర. మూవీకి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా సెట్ అయింది.
ఎవరెలా చేశారు:
దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan ) నటన గురించి మనం కొత్తగా చెప్పుకోడానికి ఏం లేదు. తన గత కురుప్(Kurup) సినిమా మాదిరిగానే షేడ్స్ ఉన్న పాత్ర కావడంతో చాలా ఈజ్‌గా చేశాడు అనిపిస్తుంది. దుల్కర్ సల్మాన్‌లో ఉన్న గొప్ప విషయం ఏంటి అంటే, మలయాళం నటుడు అయ్యి ఉండి కూడా, తనే స్వయంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంటాడు. ఇందులో 40 ఏళ్ల వ్యక్తి పాత్రలో దుల్కర్ బాడీ లాంగ్వేజ్ ఆకట్టుకుంటుంది. అలాగే డాన్‌గా మెప్పిస్తాడు. రాజు పాత్ర తరువాత సినిమాలో షబ్బిర్ రోల్ చెప్పుకోతగిందిగా ఉంటుంది. అతని బాడీ లాంగ్వేజ్ చాలా డిఫరెంట్ అని చెప్పవచ్చు. తల్లి పాత్రలో నైల ఉష పర్వాలేదనిపించుకుంది. గోకుల్ సురేష్, శాంతి కృష్ణ, అనిఖా సురేంద్రన్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. స్పెషల్ సాంగ్ లో రితికా సింగ్ స్టెప్పులు బాగున్నాయి. విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ గెస్ట్ అపీరియన్స్ కు మంచి అప్లాజ్ వచ్చింది. అతడి లుక్స్ కూడా బాగున్నాయి. ఇక హీరోయిన్గా ఐశ్వర్య లక్ష్మి ఉన్నంతలో బాగా చేసింది. చెంబన్ వినోద్ తనదైన నటనతో సీరియస్ గా కనిపిస్తూనే నవ్వించాడు. ఇక మిగతా నటీనటులు వారి పాత్రల మేరకు న్యాయం చేశారు.
సాంకేతిక విభాగం:
సినిమాటోగ్రఫీ నిమిష్ రవి సినిమాని తన భుజాలపై మోశాడు అని చెప్పవచ్చు. సినిమా ఆద్యాంతం తన కెమెరా పనితనంతో కొత్తగా చూపించాడు. ముఖ్యంగా.. స్లోమోషన్ షాట్స్, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ షాట్స్ ను కంపోజ్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. జేక్స్ బిజోయ్ పాటల కన్నా బీజీఎమ్ అదరగొట్టాడు. ముఖ్యంగా ఎలివేషన్ షాట్స్ కి కొత్తగా కొట్టాడు. రెగ్యూలర్ ఫార్మెట్లా కాకుండా చాలా రిథమిక్‌గా ఉంటుంది. ఇక 1980 నాటి స్థితిగతులను రీక్రియేట్ చేయడంలో ఆర్ట్ డైరెక్టర్ విజయం సాధించారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.