ప్రస్తుతం సౌత్ సినిమాల డామినేషన్‌తో ఉక్కిరి బిక్కిరి అవుతున్న బాలీవుడ్.. భారీ పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ మూవీ పైనే ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా బాలీవుడ్‌కు కొత్త ఊపిరి పోస్తుందని గట్టిగా నమ్ముతున్నారు బాలీవుడ్ మేకర్స్ అండ్ స్టార్ హీరోలు. అందుకు తగ్గట్టే ప్రమోషన్స్ చేస్తోంది చిత్ర యూనిట్. ఇక ఈ ప్రాజెక్ట్‌లో రాజమౌళి హ్యాండ్ కూడా ఉండడంతో.. ‘బ్రహ్మాస్త్ర’ నెగెటివ్ గాలి కాస్త పాజిటివ్‌గా మారుతోంది. పైగా అమితాబ్, రణబీర్, అలియా, నాగార్జున.. ఇలా స్టార్ క్యాస్టింగ్ ఉండడంతో సినిమా పై అంచనాలు పెరిగిపోతున్నాయి. అత్యధిక బడ్జెట్‌తో ఏకంగా మూడు భాగాలుగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ నెల 9న ఫస్ట్ పార్ట్ థియేటర్లోకి రానుంది. ఇప్పటికే మొదలైన అడ్వాన్స్ బుకింగ్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాను కరణ్ జోహార్‌తో పాటు బడా నిర్మాణ సంస్థలు 400 కోట్లకు పైగా బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా రూపొందించాయి. అయితే ఇప్పుడు బాలీవుడ్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య బాయ్ కాట్ ట్రెండ్. కాబట్టి ప్రస్తుత పరిస్థితులు ‘బ్రహ్మాస్త్ర’ ముందు భారీ టార్గెట్‌నే ఫిక్స్ చేశాయనే చెప్పాలి. ఇప్పటికే బాలీవుడ్ నుంచి వచ్చిన బడా సినిమాలు వందల కోట్లలో నష్టాన్ని చవిచూశాయి. దాంతో ఏ మాత్రం మౌత్ టాక్ తేడా కొట్టిన ‘బ్రహ్మాస్త్ర’కు భారీ నష్టాలు తప్పవంటున్నారు. కానీ కంటెంట్ ఉండి.. పాజిటివ్ టాక్ వస్తే మాత్రం.. ట్రిపుల్ ఆర్, కెజీయఫ్2 తర్వాత స్థానాల్లో బ్రహ్మాస్త్ర నిలవడం పక్కా అంటున్నారు. అయితే ‘బ్రహ్మాస్త్ర’ ఈ టార్గెట్‌ను రీచ్ అవ్వాలంటే.. భారీ ఓపెనింగ్స్ రాబట్టాల్సి ఉంది. కానీ ఈ సినిమా పై రాజమౌళి గట్టి నమ్మకంతో ఉన్నాడు కాబట్టి అది సాధ్యమే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.